‘భరత్’ ఓవరాక్షన్.. దుమ్మెత్తిపోస్తున్న ఆడియెన్స్

రికార్డుల కోసమని చెప్పి కొందరు మేకర్స్ కావాలనే ఎక్కువ కలెక్షన్లు చూపిస్తుంటారు. వాస్తవానికి అంత వసూళ్ళు రాకపోయినా.. లేదు నిజంగానే వచ్చాయంటూ డప్పు వాయించుకుంటుంటారు. ఇలాంటి ఘనతల్ని టాలీవుడ్‌లో ఇప్పటికే ఎన్నోసార్లు చూశాం! ఇప్పుడు ‘భరత్ అనే నేను’ కూడా అదే ఫేక్ బాట పట్టినట్లు తెలుస్తోంది. తాము చెప్తున్న ఫిగర్స్‌కి, ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్న రిపోర్ట్‌కి ఏమాత్రం పొంతన లేకపోవడంతో.. ‘భరత్’ యూనిట్ ఓవరాక్షన్ చేస్తోందని స్పష్టమవుతోంది.

ఒకసారో, రెండుసార్లో అంటే ఏమో అనుకోవచ్చు.. మొదట్నుంచీ ‘భరత్’ చిత్రబృందం ‘ఓవర్’ కలెక్షన్లే చెప్పుకుంటూ వస్తోంది. తొలిరోజు వసూళ్ళు అటూఇటూ అయినా ఫిగర్ దాదాపు దగ్గరగా వుండటంతో పెద్దగా అనుమానాలేమీ రాలేదు. కానీ.. రెండో రోజు మాత్రం ఏకంగా రూ.100 కోట్లు గ్రాస్ వచ్చిందని యూనిట్ చెప్పగానే అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అది నిజమా? కాదా? అని ఆరాతీస్తే.. ట్రేడ్ వర్గాల లెక్కలేమో రూ.70 కోట్లేనని తేల్చిపారేశాయి. సరే.. ప్రమోషన్స్ కోసం ఆ ఫీట్ చేసి ఉంటుందిలే అని అంతా లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ ఫిగర్సే చెప్తారులే అని భావించారు. కానీ.. ఆ తర్వాత కూడా ‘భరత్’ యూనిట్ మారలేదు. అంతకుమించి మరింత రెచ్చిపోయింది.

ఫస్ట్ వీక్‌లో ఏకంగా రూ.161.28 కోట్ల గ్రాస్ వచ్చినట్లు బాంబు పేల్చింది. అయితే.. ట్రేడ్ వర్గాలేమో కేవలం రూ.120 కోట్లేనని తేల్చింది. ఇప్పుడు మూడు వారాల తర్వాత అదే ట్రేడ్ రూ.155+ కోట్లు నమోదయ్యాయని పేర్కొంటే.. చిత్రబృందం మాత్రం ఏకంగా రూ.205 కోట్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఇక్కడితో భరత్ యూనిట్ నిజంగానే ఓవరాక్షన్ చేస్తోందంటూ జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. అఫ్‌కోర్స్.. ట్రేడ్ వర్గాలకి రిపోర్ట్ తక్కువగానే అందుతుంది. కానీ.. అది పదో పరకో తేడా ఉంటుంది కానీ.. మరీ 50 కోట్ల రేంజ్‌లో ఉండదు. అందుకే.. ‘భరత్’ యూనిట్ అడ్డంగా దొరికిపోయింది. దీనికి వారు ఎలా సంజాయిషీ ఇచ్చుకుంటారో చూడాలి!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.