‘భరత్ అనే నేను’ సెన్సార్ రిపోర్ట్.. షాకింగ్ రన్‌టైంతో సీఎం చార్జ్

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులందరూ వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా జీరో కట్స్‌తో U/A సర్టిఫికేట్‌ను జారీ చేసింది. అంతేకాదు.. ఈ మూవీకి పాజిటివ్ రిపోర్ట్ కూడా ఇచ్చినట్లు సమాచారం.

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. తన సినిమాల ద్వారా సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే దర్శకుడు కొరటాల శివ ఈసారి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ‘భరత్ అనే నేను’ ద్వారా చాలా సామాజిక సందేశాల్ని అందించాడని అంటున్నారు. రాజకీయ ‘లోగుట్టు’లను కళ్ళకు కట్టికట్లుగా ఎంతో సహజంగా చూపించాడని.. ఈ మూవీ చూశాక పాలిటిక్స్‌పై జనాల అభిప్రాయం ఖచ్చితంగా మారుతుందని చెప్తున్నారు. కొరటాల నిజంగానే సాహసవంతమైన పని చేశాడని.. రాజకీయ నాయకులకు ఈ మూవీ ద్వారా భలే కౌంటర్లిచ్చాడని పేర్కొంటున్నారు. అంతేకాదు.. జనాలకు బుద్ధొచ్చేలా చాలా మెసేజ్‌లు ఇచ్చాడట!

ఇక సినిమా పరంగా.. ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుందని తెలిసింది. ఎక్కువ సోది లేకుండా రాజకీయ నేపథ్యంతోనే మూవీని నడిపించాడట! ముఖ్యంగా.. మహేష్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి సినిమా ఎక్కడ గ్రాఫ్ తగ్గకుండా అంచనాల్ని పెంచుకుంటూ సాగుతుందని టాక్! ఇక గత రెండు సినిమాల్లో మిస్ అయిన యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో గూస్‌బంప్స్ తెప్పించేలా కొరటాల డిజైన్ చేశాడు. హీరో-హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఏదో ఉండాలని కాకుండా.. మూవీకే మెయిన్ ఎస్సెట్‌గా నిలిచేలా వుందంటున్నారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా కొరటాల రూపొందించాడని టాక్ వినిపిస్తోంది. ఇక రన్‌టైం ఏకంగా 2 గంటల 53 నిముషాలు ఉన్నట్లు తేలింది. అయితే.. సినిమా మూడ్‌లోకి వెళ్లిపోయిన జనాలపై ఆ రన్‌టైం ఏమాత్రం ప్రభావం చూపదని.. అంతలా చిత్రం ఆకట్టుకుంటుందని సమాచారం. సో.. ఈనెల 20వ తేదీన సంచలనాలు నమోదు చేయడానికి మన సీఎం సాబ్ రంగంలోకి దిగుతున్నారన్నమాట!

Related posts:
సమంతని బాగా అలసిపోయేలా చేసిన ఆ 8 నెలలు
సంపూర్ణేష్ బాబుకి ఘోర అవమానం..!
‘కబాలి’ (తెలుగు) 4 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్‌తోపాటు గుడ్ న్యూస్..!
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్లోజింగ్ కలెక్షన్స్.. మంచి లాభాలు తెచ్చిపెట్టిన బాలయ్య
‘కాటమరాయుడు’ వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్.. సెంచరీ కొట్టిన పవన్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.