‘భరత్’ దెబ్బకు దద్దరిల్లిన యూఎస్ గడ్డ.. మహేషా మజాకా!

ప్రిన్స్ మహేష్‌బాబుని యూఎస్‌కా బాప్ ఎందుకు అంటారో తన లేటెస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’తో మరోసారి నిరూపించుకున్నాడు. ల్యాండ్ అవ్వడమే ఆలస్యం.. మనోడి దెబ్బకు యూఎస్ గడ్డ గడగడలాడింది. ఏ రేంజులో అంటే.. కేవలం రెండు రోజుల్లోనే ‘నాన్-బాహుబలి’ రికార్డ్ సృష్టించేంత! అవును.. ఇది అక్షరాల నిజం!

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఈ చిత్రం రెండు రోజుల్లోనే యూఎస్‌లో 2 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. ప్రీమియర్స్‌తో కలుపుకుని శుక్రవారం $1.4M రాబట్టిన ఈ చిత్రం.. శనివారం $640K కలెక్ట్ చేసింది. ‘బాహుబలి-2’ తర్వాత ఇంత తక్కువ టైంలో ఈ ఫీట్ అందుకున్న రెండో చిత్రంగా ‘భరత్ అనే నేను’ హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఎలాంటి ఆఫర్స్ లేకుండానే మహేష్ మూవీ ఈ రికార్డ్ సృష్టించింది.

సాధారణంగా అక్కడి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఏవేవో ఆఫర్స్ పెట్టేస్తారు. ‘బాహుబలి’ రిలీజ్ టైంలోనూ ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యారు. కానీ.. ‘భరత్ అనే నేను’ బయ్యర్స్ దీన్ని ఫాలో అవ్వలేదు. అయినా.. రికార్డ్ వసూళ్ళు కొల్లగొట్టింది. అది.. మహేష్ స్టామినా అంటే!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.