భరత్ అనే నేను ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’ రిలీజ్ రోజునే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కొరటాల శివ – మహేష్ కాంబో అనగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేగాక బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి డిజాస్టర్ల తరువాత ఈ చిత్రం వస్తుండటంతో ‘భరత్ అనే నేను’పై అంచనాలు బాగా పెరిగాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ రోజున అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. దీంతో ఈ సినిమా తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 21.94 కోట్లు సాధించింది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి భరత్ అనే నేను చిత్రం వరల్డ్‌వైడ్‌‌గా ఏకంగా రూ. 59.23 కోట్లు సాధించింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఇప్పటికే రెండు మిలియన్ మార్కును క్రాస్ చేసి మహేష్ సత్తా ఏమిటో చూపించింది. ఇక ఏరియాల వారీగా భరత్ అనే నేను ఫస్ట్ వీకెండ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 10
సీడెడ్ – 5.55
ఉత్తరాంధ్ర – 5.17
గుంటూరు – 5.57
ఈస్ట్ గోదావరి – 4.42
వెస్ట్ గోదావరి – 2.63
కృష్ణా – 2.77
నెల్లూరు – 1.42
టోటల్ ఏపీ+తెలంగాణ – 37.53
రెస్టాఫ్ ఇండియా – 8
ఓవర్సీస్ – 13.70
టోటల్ వరల్డ్‌వైడ్ – 59.23 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.