చరిత్ర సృష్టించిన భరత్.. రెండు రోజుల్లోనే సెంచరీ

అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. కేవలం రెండు రోజుల పరుగులోనే ‘భరత్ అనే నేను’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు గ్రాస్ కొల్లగొట్టింది. ‘బాహుబలి’ తర్వాత జస్ట్ 2 డేస్‌లోనే ఈ మార్క్ అందుకున్న రెండో తెలుగు చిత్రంగా ‘భరత్ అనే నేను’ చరిత్ర సృష్టించింది. ఇండియావైడ్‌గా రూ.74 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.26 కోట్లు రాబట్టి.. ఓవరాల్‌ వరల్డ్‌వైడ్‌గా సెంచరీ కొట్టినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

‘శ్రీమంతుడు’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మహేష్, కొరటాల మరోసారి జతకట్టడంతో.. బుకింగ్స్ ద్వారానే బోలెడంత కలెక్షన్లు వచ్చిపడ్డాయి. ఇక రిలీజయ్యాక.. తమ అభిరుచికి తగ్గట్టుగానే సినిమా అలరించడంతో జనాలు దీనికి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా.. ఇందులో లేవనెత్తిన కొన్ని సామాజిక అంశాలు రియాలిటీకి దగ్గరగా వుండటంతో ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోయారు. ఇక సీఎం రోల్‌లో మహేష్ అదరగొట్టడం, కొరటాల తన మార్క్ స్టైల్‌లోనే మూవీని బ్రహ్మాండంగా తెరకెక్కించడంతో.. ఈ మూవీకి జనాలు ఫిదా అయిపోయారు. అందుకే.. రెండు రోజుల్లోనే ఈ చిత్రం ‘సెంచరీ’ ఫీట్‌ని అందుకోగలిగింది.

అన్నట్టు ఇంకో విషయం.. కొన్ని ఏరియాల్లో ఈ మూవీ ‘నాన్ బాహుబలి-2’ రికార్డుల్ని కూడా సృష్టించింది. ఇక్కడే ఈ మూవీ ఏ రేంజులో సునామీ సృష్టిస్తోందో అర్థమైపోతోంది. మొత్తానికి.. రెండేళ్ళ నుంచి డిజాస్టర్లతో తీవ్రంగా నిరాశపరిచిన మహేష్, తన లేటెస్ట్ మూవీతో రికార్డుల భరతం పడుతూ ఫ్యాన్స్ ఆకలిని తీర్చేశాడని చెప్పుకోవచ్చు. ఇంకా రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.