‘భరత్ అనే నేను’.. మక్కీకిమక్కి దించేశాను

అవును.. పవన్ కళ్యాణ్‌ని స్ఫూర్తిగా తీసుకుని ‘భరత్ అనే నేను’ స్టోరీ రాయడం అనేది నిజం.. దాన్ని కొరటాల శివ తన మార్క్ స్టైల్‌లో మెరుగులు దిద్దడం కూడా వాస్తవం.. కానీ మూలకథ మాత్రం పాతది! ఇదివరకు ఇదే థీమ్‌తో ఒక చిత్రం తెలుగులోనే వచ్చింది. అదే మహేష్ మూవీలోనూ చూడబోతున్నాం! ఓపెన్‌గా చెప్పాలంటే.. కాపీ కొట్టారని చెప్పుకోవచ్చు. ఇంతకు ఆ పాత మూవీ ఏది? అని అనుకుంటున్నారా! మరేదో కాదు.. రానా సీఎం పాత్రలో కనిపించిన ‘లీడర్’.

ఒక్కసారి ‘లీడర్’ సినిమా కథలోకి వెళ్తే.. అందులో తండ్రి చనిపోయాక రానా ‘సీఎం’ అవుతాడు. అంతకుముందు నేతలకు లంచమిచ్చి తనవైపుకు తిప్పుకుని.. సీఎం అయ్యాక అడ్మినిస్ట్రేషన్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. తండ్రి చివరి కోరిక మేరకు పాలిటిక్స్‌ని శుద్ధి చేస్తాడు. సేమ్ ఇదే థీమ్‌తో ‘భరత్ అనే నేను’ మూవీ సాగుతుందట. తండ్రి చనిపోయాక తల్లి ఒత్తిడి మేరకు మహేష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అయితే.. రాజకీయాల్లో కొత్త కావడంతో అడ్మినిష్ట్రేషన్‌, పాలసీ మేకింగ్‌లో ఎన్నో బ్లండర్స్ చేస్తాడు. చివరికి ఒక గ్రామానికి వెళ్ళాక సీఎంగా తన బాధ్యతలేంటో తెలుసుకుంటాడు. ఇక అప్పటినుంచి అతను చెలరేగిపోతాడు.

విప్లవాత్మక పథకాలు అమలులోకి తీసుకొస్తాడు. అదే టైంలో ఇతనికి ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. వాటిని ఎదుర్కొని, రాజకీయాల్ని పరిశుభ్రం చేసి, చివరికి విప్లవాత్మక సీఎంగా పేరొందుతాడు. ఇది అసలు సంగతి! ‘లీడర్’లోని రానా సీఎం పాత్ర పోలికలతోనే ‘భరత్’ సాగుతుంది. కాకపోతే.. కొరటాల మార్క్ మేకింగ్‌తో ఈ మూవీ రూపొందుతుంది కాబట్టి గూస్‌బంప్స్ తెప్పించే మూవ్‌మెంట్స్‌కి ఏమాత్రం ఢోకా ఉండదు.

Related posts:
ఛార్మీపై పూరీ రుస‌రుస‌లు...ఛార్మింగ్‌గ‌ర్ల్‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు
తొలి సినిమాకే అఖిల్ ముదిరిపోయాడు
జులాయి‌తో త్రివిక్రమ్ కానిచ్చేస్తాడట..
రాజమౌళికి షాక్.. ‘గరుడ’ని లాగేసుకున్న తమిళ స్టార్ హీరో
నిత్యామీనన్ అందుకే తెలుగు సినిమాల్ని రిజెక్ట్ చేస్తోందట.. సీక్రెట్ బయటపెట్టిన స్టార్ డైరెక్టర్!
ఎన్టీఆర్ కోసం ఆ హాట్ బ్యూటీ వెంటపడ్డ త్రివిక్రమ్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.