పుండు మీద కారం చల్లిన మహేష్.. దేతడి పోచమ్మగుడి!

bharath ane nenu announces no change in release date

‘ఏప్రిల్ 27వ తేదీ’ తెలుగు చిత్రపరిశ్రమలో పెద్ద భూకంపానికే కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. గతంతో మునుపెన్నడూలేని అతిపెద్ద గొడవకి అది కేంద్రబిందువు కానుందని డైరెక్ట్ సంకేతాలే అందుతున్నాయి.

ఆల్రెడీ అల్లుఅర్జున్ పునాది వేసి తిష్ట వేస్తే.. ఇంతలో మహేష్‌బాబు దానిపై బిల్డింగ్ కట్టేశాడు. ఇదేంటని బన్నీ ప్రశ్నిస్తుంటే.. నేనింతేనంటూ మహేష్ వాదిస్తున్నాడు. ఇలా ఇద్దరూ పీకల్లోతు గొడవ పడుతుంటే.. ఏకంగా మొత్తం బిల్డింగ్‌నే కూల్చేస్తానంటూ రజనీకాంత్ పెద్ద బాంబ్ పేల్చారు. ఈ భీకరమైన పోరాటంలో ఎవరో ఒకరు వెనక్కు తగ్గుతారేమోనని భావిస్తుంటే.. అస్సలు వెనక్కే ప్రసక్తే లేదంటూ ఎవ్వరూ తగ్గట్లేదు. ఇక మహేష్ అయితే ప్రతిసారీ పుండుమీద కారం చల్లుతూ ఈ వివాదాన్ని మరింత అగ్గిరాజేలా చేస్తున్నాడు.

రీసెంట్‌గానే ఈ పోటీ నుంచి మహేష్ వెనక్కు తగ్గనున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పటికే రెండు డిజాస్టర్లతో భారీ డ్యామేజ్ జరగడంతో.. పోటీకెళ్లి రిస్క్ చేయడంకంటే వెనక్కి తగ్గడమే మేలని మహేష్ నిర్ణయించుకుని.. యూనిట్‌తో చర్చలు జరిపి ప్రీ-పోన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, తాను ఏమాత్రం వెనక్కి తగ్గేదిలేంటూ మరోసారి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశాడు మహేష్. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ పోస్టర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది కూడా!

‘భరత్ అనే నేను’ తదుపరి షెడ్యూల్ తమిళనాడులో ఈనెల 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనుందని తెలిపింది. అలాగే.. ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదని, త్వరలోనే ఆ విషయంపై క్లారిటీ ఇస్తామని పేర్కొంది. ఇక రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదని, ఏప్రిల్ 27వ తేదీనే తమ చిత్రం రిలీజ్ కానుందని కన్ఫమ్ చేసింది. అటు బన్నీవాస్ కూడా ‘నా పేరు సూర్య’ 27నే రిలీజ్ పక్కా అంటున్నాడు. మరి.. పోటీకి దిగుతారా? లేక ఎవరైనా వెనక్కు తగ్గుతారా? వేచి చూడాల్సిందే.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.