మహేష్ భరతం పట్టిన బన్నీ.. పరుగో పరుగు!

ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని అంతా అనుకున్నారు. ‘నా పేరు సూర్య’ చిత్రబృందం తొలుత తామే బుక్ చేసుకోవడంతో రిలీజ్ డేట్‌ని మార్చుకునేదే లేదని పట్టుబడితే.. ‘భరత్ అనే నేను’ యూనిట్ నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉండడాన్ని చూసి.. ఈ రెండూ ఒకేరోజు రావడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. మహేష్ చిత్రం ఇప్పుడు పరుగు లంకించినట్లు సమాచారం.

ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం.. మహేష్ చిత్రం జూన్‌లో రిలీజయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇందుకు గల కారణాలైతే పక్కాగా తెలియరాలేదు కానీ.. ‘నా పేరుతో సూర్య’ టీంతో అవనసరంగా గొడవ పడడం ఎందుకనే ఉద్దేశంతో పోస్ట్‌పోన్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. మహేష్ చిత్రాన్ని ఇలా వాయిదా పడడం ఒక విధంగా మంచిదేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే.. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ చేసిన ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అవి భారీ నష్టాలు మిగిల్చి, బయ్యర్లు బజారునపడ్డారు. అటు బన్నీ వరుస విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. పైగా ‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇలాంటి టైంలో పోటీపడితే.. మహేష్ చిత్రం కలెక్షన్లపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. మహేష్ మార్కెట్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే.. మహేష్ సోలోగా రావడమే బెటర్ అంటున్నారు సినీ పండితులు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు చీఫ్ మినిస్టర్‌గా కనిపించబోతుండగా.. అతని సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్తి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దానయ్య డివివి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ దర్శకుడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.