‘బిచ్చగాడు’ సక్సెస్‌కి కారణం.. ‘గాయత్రి మంత్రం’!!!

Bichagadu Sensational Hit Behind Gayantri Mantra

Reason Behind Bichagadu Sensational Hit Is Gayantri Mantra. Read How It Helps. Tollywood and sensational news updates Neticinema is one among the best. Experience the unique presentation of articles for the film industry latest updates and trending news.

ఎలాంటి అంచనాలు లేకుండా మే 13వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతకుముందు వచ్చిన సూర్య ‘24’, ‘సుప్రీం’ సినిమాలు అప్పటికే హిట్ టాక్ తెచ్చుకుని హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఆడుతున్నాయి. ఆ సునామీ ముందు ‘బిచ్చగాడు’ కొట్టుకుపోతుందని అంతా భావించారు. కానీ.. ఆ సినిమా విడుదలయ్యాక దానికి పాజిటివ్ టాక్, రివ్యూలు బాగా రావడంతో ఆ రెండు చిత్రాల వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఇక మే 20వ తేదీన మహేష్ ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఎన్నో అంచనాల్ని మూటగట్టుకున్న ఆ మూవీ ముందు ఏ సినిమా నిలవదని అనుకున్నారు. కట్ చేస్తే.. రిలీజయ్యాక దాని రిజల్ట్ చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. మహేష్ కెరీర్‌లోనే అది అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో.. అందరూ మళ్ళీ ‘బిచ్చగాడు’వైపే దృష్టి సారించడంతో కలెక్షన్లతోపాటు స్ర్కీన్స్ పెరుగుతూ వచ్చాయి.

Read in English : Gayathri Manthram and “Bichagadu”

ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి తప్ప.. ఏ ఒక్కటీ ‘బిచ్చగాడు’ మీద ప్రభావం చూపలేకపోయాయి. అంతెందుకు.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ సినిమా కూడా ఆ సినిమాపై ఎఫెక్ట్ చూపలేకపోయింది. ‘కబాలి’ రిలీజైన తొలి మూడురోజుల్లో ప్రభంజనం సృష్టించడంతో ‘బిచ్చగాడు’ వసూళ్ళు కాస్త తగ్గాయే తప్ప… ఆ తర్వాత నాలుగో రోజు నుంచి మళ్ళీ పుంజుకుంది. ‘కబాలి’కి కూడా మిశ్రమ స్పందన రావడంతో వీక్ డేస్‌లో ఆ మూవీ వసూళ్లు 80 శాతానికి పడిపోయాయి. ఇది ‘బిచ్చగాడు’కి బాగా కలిసొచ్చింది. ఫలితంగా దాని వసూళ్లు మళ్ళీ పెరిగాయి.. అలాగే థియేటర్ల సంఖ్య కూడా. అలా.. ఎన్నో భారీ సినిమాలను దాటుకుంటూ ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. 25 రోజులు ఆడటమే కష్టంగా మారిన ఈరోజుల్లో.. ‘బిచ్చగాడు’ 150కిపైగా సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడం నిజంగా సంచలనమే. అది కూడా ఓ డబ్బింగ్ చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించడం విశేషం. రిలీజ్‌కి ముందు పెద్దగా ప్రమోట్ చేయలేదు.. అంచనాలూ ఏమాత్రం లేవు.. పైగా ఓ డబ్బింగ్ సినిమా.. అందులో నటించిన యాక్టర్ల గురించి తెలుగు ఆడియెన్స్‌కి పెద్దగా తెలీదు.. అలాంటిది ఓ రికార్డ్ విజయాన్ని నమోదు చేసుకుంది.

చూస్తుంటే.. ఈ మూవీ విజయానికి ఓ అద్భుత శక్తి తోడుందని చెప్పుకుంటున్నారు. అదే ‘గాయత్రి మంత్రం’ అని చర్చించుకుంటున్నారు. ఆ మంత్రాన్ని జపించడం, దానిని విన్నవారికి కూడా అంతా శుభమే జరుగుతుందని అందరి నమ్మకం. ఎన్నో అరిష్టాల నుంచి అది కాపాడుతుంది. ‘బిచ్చగాడు’ సినిమాని కూడా సంచలన విజయంవైపు తీసుకెళ్ళిందని నమ్ముతున్నారు. అసలు ఆ మంత్రానికి, ఈ చిత్రానికి సంబంధం ఏంటి? అని అనుకుంటున్నారా! ఆ మూవీలో చాలాచోట్ల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో ఆ మంత్రం వినిపిస్తుంది. ఓ పాట కూడా ఉంది. ఈ మూవీ విజయానికి మదర్ సెంటిమెంట్ ఎంతగా వర్కౌట్ అయ్యిందో.. అంతే ‘గాయత్రి మంత్రం’ ఎఫెక్ట్ కూడా ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నుంచి సెంటిమెంట్‌గా అన్ని సినిమాల్లోనూ ఈ మంత్రం వినిపిస్తుందని, అదొక ట్రెండ్ అవుతుందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అసలే సినిమావాళ్ళు సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతారు. సక్సెస్‌కి సంబంధించి ఏ సెంటిమెంట్‌నీ వదులుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి.. ‘గాయత్రి మంత్రం’ కూడా హిట్ సెంటిమెంట్‌గా నిలిచే ఛాన్స్ ఉంది.

Related posts:
‘నాన్న’ని హత్తుకుని అరగంటపాటు ఏడ్చేసిన ఎన్టీఆర్
సూప్రీమ్‌తో కళ్లుచెదిరే బిజినెస్ చేస్తున్న దిల్ రాజు
‘‘అమ్మ నవ్వింది కాదు నవ్వించింది’’ అంటూ కలమెత్తిన క్రిష్
జనతా గ్యారేజ్ - ఇండియా లోనే నంబర్ టూ -- ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!!
‘మెంటల్ మదిలో’ - ఓట్లు ఫుల్.. మెజారిటీ నిల్!
ఆక్సిజన్ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.