బయటపడ్డ ‘బిగ్‌బాస్’ కంటెస్టంట్ల రెమ్యునరేషన్ లెక్క!

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బిగ్‌బాస్-2’ హంగామానే నడుస్తోంది. మొదట్లో పెద్దగా పాపులారిటీ లేని కంటెస్టంట్లను ఎంపిక చేశారనే అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ.. ‘బిగ్‌బాస్’ పేరుకున్న బ్రాండ్ వ్యాల్యూని చూసి రెండో సీజన్‌ని జనాలు బాగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక చర్చ వెలుగులోకి వచ్చింది. గతంలో కాస్త పేరున్న సెలబ్రిటీలున్నారు కాబట్టి.. వాళ్ళకి పారితోషికాలు బాగానే అందాయి. ఈసారి చాలావరకు ఫేమ్ లేని వారే ఉన్నారు కాబట్టి.. వీళ్ళ రెమ్యునరేషన్ ఎంతుంటుంది? అనే ప్రశ్న తలెత్తింది. మొత్తానికి ఆ లెక్కల చిట్టా ఇప్పుడు బయటపడింది.

ఈ షోలో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టంట్.. గీతా మాధురి! సింగర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది కాబట్టి.. ఆమెకి రూ.20 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. అదికూడా రోజులవారీగా కాదు.. ఒకేసారి హోల్‌సేల్ ప్యాకేజ్! అంటే.. మధ్యలో వెళ్లిపోయినా అందులో కట్టింగ్స్ ఉండవు. ఈమె తర్వాత శ్యామల రూ.10 లక్షల పారితోషికంతో సెకండ్ హయ్యెస్ట్‌గా నిలిచింది. యువ నటుడు తనీష్ కూడా ఒకటి, రెండు లక్షల అటుఇటుగా మూడో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. ఇక మిగతావారికి రూ.15-25 వేల చొప్పున ‘స్టార్‌మా’ అగ్రిమెంట్ చేసుకుందని అంటున్నారు. కాకపోతే.. బాబు గోగినేని పారితోషికం ఎంతన్నది అంతుపట్టడం లేదు.

ఇవన్నీ అధికారిక లెక్కలైతే కాదు కానీ.. ఇండస్ట్రీలో మాత్రం ఇవి నిజమైన లెక్కలేనని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే.. ఈసారి బిగ్‌బాస్ తక్కువ బడ్జెట్‌లోనే కార్యక్రమాన్ని కానిచ్చేస్తున్నట్లు అనిపిస్తోంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.