మహానటిలో మాయమైన మరోనటి..!

అలనాటి లెజెండరీ హీరయిన్ సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ‘మహానటి’ మూవీ అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాపై ఏ ఒక్కరు నెగిటివ్‌గా మాట్లాడిన వారు లేరు కాని నటి బిందు చంద్రమౌళి మాత్రం సినిమాపై తన అసంతృప్తిని వ్యక్తపరచింది. ఇంతకీ బిందు చంద్రమౌళి ఎవరు అనేగా మీ సందేహం.. అయితే మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.

మహానటి సినిమాలో జెమిని గణేషన్ స్నేహితురాలు పుష్పవల్లి అనే పాత్ర చేసింది బిందు చంద్రమౌళి అనే హీరోయిన్. సినిమా రన్ టైం ఎక్కువడంతో ఆమె సీన్స్ సినిమా నుండి తొలగించారు. పుష్పవల్లి ఆమె కుమార్తె రేఖ(సీనియర్ నటి రేఖ) పాత్రల్ని తొలగించారు మహానటి చిత్ర యూనిట్. దీనిపై స్పందించిన బిందు చంద్రమౌళి సినిమాలో తన పాత్ర కట్ చేసినందుకు చాలా బాధపడ్డానని.. అయినా పర్వాలేదు చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పుకొచ్చింది. సినిమాలో తెర మీద తన పాత్రలేకున్నా మహానటి సినిమాలో నటించానన్న సంతృప్తి తనకు ఉందని అన్నది. ఇదవరకు సినిమాల్లో కూడా తన పాత్ర ఎడిటింగ్ లో తీసేస్తే బాధపడ్డానని కాని ఈసారి ఎక్కువ నిరాశకు గురయ్యానని అన్నది బిందు చంద్రమౌళి.

థియేట్రికల్ మూవీలో బిందు చంద్రమౌళి సీన్స్ లేకున్నా శాటిలైట్, డిజిటల్ వర్షన్‌లో ఈమె సీన్స్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు చిత్ర యూనిట్. మరి మహానటిలో మాయమైన నటి ఎక్కడ ప్రత్యక్షమవుతుందో చూడాలి.

Related posts:
‘సోగ్గాడే చిన్నినాయన’పై సెన్సార్ ఇచ్చిన థ్రిల్లింగ్ రిపోర్ట్
లిప్‌లాక్ ప్రాక్టీస్ చేయిస్తున్న డైరెక్టర్ (వీడియో)
‘అ..ఆ’ మూవీ తొమ్మిది రోజుల కలెక్షన్స్ వివరాలు..
అక్కడ కూడా ‘బ్రహ్మోత్సవం’ జరుపుకుంటున్న ‘స్పైడర్’
అభిమాని మృతితో కన్నీరు పెట్టి కదిలించిని కార్తీ!
‘రంగస్థలం’పై చిరంజీవి ‘అవార్డుల’ వార్నింగ్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.