ఆట్.. నందమూరి ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించే వార్త!

ప్రస్తుతం తన తండ్రి ‘ఎన్టీఆర్’ బయోపిక్ చేస్తున్న బాలకృష్ణ.. ఈ మూవీ అనంతరం బోయపాటి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు అందరికీ తెలుసు! ‘ఎన్టీఆర్’ లాంచ్ సమయంలో స్వయంగా ఈ విషయాన్ని బోయపాటి తెలిపాడు. అంతే.. ఆ తర్వాత మళ్ళీ దాని ఊసే ఎత్తలేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారే తప్పితే.. ఏ ఒక్కరూ ఆ సినిమా గురించి పల్లెత్తి మాట్లాడలేదు. ఇది నందమూరి ఫ్యాన్స్‌లో కంగారు పెంచింది. చివరి నిముషంలో వాళ్ళ కాంబో ఎక్కడ బ్రేక్ అవుతుందా? అనే ఆందోళనలో ముంచేసింది. అయితే.. ఇప్పుడు అలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్ట్ పక్కాగా పట్టాలెక్కనున్నట్లు ఓ ఆధారం బయటకొచ్చింది.

సినీవర్గాల లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. బోయపాటి-బాలయ్యల మూడో చిత్రం స్ర్కిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత ఎమ్.రత్నం ఈ సినిమా కథను రాసే పనిలో వున్నారు. ఈ చిత్రం రాజకీయ నేపథ్యంతోనే సాగుతుందని.. సమాజంలోకి కుళ్ళను ప్రశ్నించి, ఎండగట్టే విధంగా చాలా పవర్‌ఫుల్‌గా స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎలాగో బాలయ్య రాజకీయాల్లో ఉన్నారు. పైగా ఎన్నికలు కూడా వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే.. రాజకీయ నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు సమాచారం! కమర్షియల్ సినిమాల్లోనే బాలయ్య రెచ్చిపోయి తన విశ్వరూపం చూపిస్తారు.. ఇక రాజకీయ నేపథ్యం అంటే, ఆయన ఎనర్జీ ఏ రేంజులో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం!

ఇదివరకే రెండు చిత్రాల ద్వారా బోయపాటి-బాలయ్యలు తమది పవర్‌ఫుల్ కాంబినేషన్ అని నిరూపించుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జతకడుతున్నారు కాబట్టి.. ఈ చిత్రంపై ఆల్రెడీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. వాటిని అందుకునే రీతిలోనే ఈ చిత్రాన్ని బోయపాటి తీర్చిదిద్దుతాడా? లేదా? అనేది వెయిట్ చేయాలి.

Related posts:
దిల్ రాజుకు చెమ‌ట‌లు పట్టిస్తున్న బాహుబ‌లి
బాహుబలి అవార్డుల వేట రానా తో మొదలైంది..
శంక‌రాభ‌ర‌ణం ఫైన‌ల్ టాక్‌..ఫ‌్ల‌స్సులు, మైన‌స్‌లు!!
విలన్‌గా మారనున్న మరో కామెడీ హీరో.. ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. వినాయక్ ఆ మూవీ చేయట్లేదట!
‘అర్జున్‌రెడ్డి’ 17 డేస్ ఓవర్సీస్ కలెక్షన్స్.. టాప్ టెన్‌లోకి ఎంట్రీ

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.