RC12: చరణ్-దానయ్యల మధ్య ‘భోరు’పాటి

చరణ్-బోయపాటిల చిత్రం ఏ ముహూర్తాన మొదలయ్యిందో తెలీదు కానీ.. కనీవినీ ఎరుగని పరిణామాలు చోటు చేసుకుంటూనే వున్నాయి. స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంకా ఏదో ఒక సమస్య ఈ చిత్రాన్ని వెంటాడుతూనే వుంది. పాపం బోయపాటి.. ఎలాగోలా నిర్మాతని కన్వీన్స్ చేస్తూ బండి లాక్కొస్తున్నాడులెండి! కాకపోతే.. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినట్లు సమాచారం! చివరికి చరణ్ కూడా ఈ దర్శకుడి పనితో సంతృప్తిగా లేనట్లు టాక్! ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆ ఇద్దరి మధ్య బోయపాటి నలిగిపోతున్నాడన్నమాట!

చరణ్‌తో భేదాభిప్రాయాలు రావడానికి గల కారణాలు ఏంటో క్లారిటీ లేదు. బహుశా మేకింగ్ విషయంలో కన్వీన్స్ అవ్వలేదేమో! ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు కదా.. ఆ స్థాయి మేకింగ్ బోయపాటి హ్యాండింగ్ చేయలేకపోతున్నాడని చెర్రీ ఫీల్ అవుతుండొచ్చు. ఇకపోతే.. బడ్జెట్ పరిమితులు దాటిపోతోందన్న టెన్షన్‌తో దానయ్య మనోడి మీద కోపంగా వున్నాడట! పెద్ద స్టార్ క్యాస్ట్, పైగా సెట్టింగ్స్ కూడా భారీగానే బోయపాటి వేయించాడు. అదే నిర్మాతకి గుబులు పుట్టిస్తోంటే.. షెడ్యూల్స్ ప్రకారం కొందరు కీలకమైన ఆర్టిస్టులు అందుబాటులో ఉండకపోవడం మరో పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కారణంగా పెట్టిన ఖర్చు దెబ్బకు వృధా అయిపోతోంది. రోజుకి రూ.25 లక్షల వరకూ ఖర్చు అవుతోందట!

ఇదండి అసలు సంగతి.. అటు మేకింగ్ మేటర్‌లో చెర్రీతో, ఇటు నిర్మాణ విలువల విషయంలో నిర్మాతతో వేగలేక బోయపాటి సతమతమవుతున్నట్టు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే.. షూటింగ్ కూడా ఓ పట్టాన సాగట్లేదని, డిలే అవుతూ వస్తోందని టాక్! మరి.. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే!

Related posts:
ఆమెను మ‌హేష్ వదులుకొన్నాడు...బ‌న్ని కావాలంటున్నాడు..!
అనుష్క ఆఖరి చిత్రం అదేనా..?
బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ తట్టుకోలేక..
ఆ అమౌంట్ చూసి.. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా
నిత్యామీనన్ అందుకే తెలుగు సినిమాల్ని రిజెక్ట్ చేస్తోందట.. సీక్రెట్ బయటపెట్టిన స్టార్ డైరెక్టర్!
పవన్ దెబ్బకు ‘అజ్ఞాతం’లోకి మహేష్..?

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.