చరణ్ కోసం చిరు మూవీని లేపేసిన బోయపాటి

బోయపాటి శ్రీను సినిమాలంటే.. కేవలం ఊరమాస్ కమర్షియల్ జోనర్‌లోనే కథలుంటాయనే విషయం అందరికీ తెలుసు! మనోడు ప్రయోగాలు చేయకుండా.. రొటీన్ కథలతోనే ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్నాడు. అందుకే.. ఇతని సినిమాలకు ఆడియెన్స్‌లో మంచి ఆదరణే వుంది. ఇప్పుడితను ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రామ్‌చరణ్‌తో ఓ మూవీ చేస్తున్నందుకు.. దీనిమీద తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి.

ఇంకేముంది.. ఎప్పట్లాగే ఈ మూవీ కథ ఏంటి? ఏ జోనర్‌లో ఉండబోతోంది? బోయపాటి తన రెగ్యులర్ మాస్ ఫార్ములానే ఉపయోగిస్తున్నాడా? లేక కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నాడా? అనే విషయాలపై ఆరాతీయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఆ మిస్టరీలన్నింటినీ తెరదించుతూ ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్తొకటి వెలుగులోకి వచ్చింది. ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ సినిమా కథ కూడా పరమ రొటీన్ అని టాక్ వినిపిస్తోంది. సొంతూరికి దూరంగా వుండే హీరోకి ఓ ఫ్లాష్‌బ్యాక్ వుంటుంది. వర్తమానంలోనూ దానివల్ల అతనికి ఇబ్బందులు తలెత్తడం వల్ల.. చివరికి వాటిని ఫుల్‌స్టాప్ ఎలా పెట్టాడన్నదే ఈ సినిమా కథ అని ప్రచారం జరుగుతోంది.

ఇది చూస్తుంటే.. అచ్చం ‘ఇంద్ర’ సినిమాలాగే వుంది. అందులోనూ చిరు తన సొంతూరికి దూరంగా వారణాసిలో వుండటం, అతనికి ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉందని ట్విస్ట్ రివీల్ కావడం, అనంతరం వర్తమానంలో సమస్యలన్నింటినీ పరిష్కరించడమే ఆ స్టోరీ కథే! ఇప్పుడదే స్టోరీతో బోయపాటి-చరణ్ స్టోరీ రూపొందనున్నట్లు తెలుస్తోంది. కథ తండ్రిదే కాబట్టి.. ఈ చిత్రంపై కాపీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. బోయపాటి సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం.. ఆడియెన్స్ నుంచి ఫుల్ మార్కులు పడటం ఖాయం!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.