‘పెళ్ళిచూపులు’ రీమేక్ రైట్స్‌కి బంపరాఫర్

Pelli Choopulu Tamil Remake Rights

Star director Gautam Menon acquired tamil remake rights of Tharun Bhascker’s first feature film Pelli Choopulu which create sensation at Tollywood boxoffice. Tollywood and sensational news updates Neticinema is one among the best. Experience the unique presentation of articles for the film industry latest updates and trending news.

ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమా అతిపెద్ద విజయం సాధించింది. టాలీవుడ్ హిస్టరీలో ఓ చిరకాల గుర్తింపు సంపాదించుకుంది. సంచలనాలు క్రియేట్ చేయడానికి కటౌట్ కాదు.. కంటెంట్ ఉంటే చాలని నిరూపించింది. విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. అసలు విడుదల అవ్వడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ చిత్రం.. చివరికి ఎలాగోలా రిలీజై ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ చాలా ఏరియాల్లో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ 100 రోజులు దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పుడీ మూవీకి మరో బంపరాఫర్ వరించింది.

Read in English : “PELLI CHOOPULU” GETS BUMPER OFFER FOR RE-MAKE

ఈ మూవీ తమిళ రీమేక్ రైట్స్‌ని స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు తరుణ్ బాస్కరే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘కొన్నిరోజుల కిందట గౌతమ్ మీనన్ తనకు ఫోన్ చేశారని, తాను తెరకెక్కించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘పెళ్ళిచూపులు’ తమిళ రీమేక్ రైట్స్‌ని తను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారని తరుణ్ తెలిపాడు. అయితే.. ఎంత మొత్తానికి సొంతం చేసుకున్నాడన్న విషయాన్ని తరుణ్ తెలపలేదు. ప్రేమకథాచిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గౌతమ్ మీనన్‌లాంటి డైరెక్టర్ ‘పెళ్ళిచూపులు’ రీమేక్ రైట్స్ తీసుకున్నారంటే.. యూనిట్‌కి ఫ్యాన్సీ రేటే అంది ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇదే సమయంలో తరుణ్ మరో ఆసక్తికరమైన విషయాన్ని సైతం షేర్ చేసుకున్నాడు. నవంబర్ 5వ తేదీన ‘పెళ్లిచూపులు’ వందరోజులు పూర్తి చేసుకోనుందని, అదే రోజు తన పుట్టినరోజు కూడా కావడం చాలా సంతోషంగా ఉందని సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Related posts:
మోహన్‌ బాబు, అల్లరి నరేష్‌ ల 'మామ మంచు...అల్లుడు కంచు' సెన్సార్ పూర్తి
ఫ్యాన్ గాలి సరిగా రావడం లేదంటున్న హీరో
డబ్బులిస్తేనే.. లేకపోతే పట్టించుకోనంటున్న సన్నీలియోన్
తల్లి కాబోతున్న శ్రియ.. కారణం శింబు!
‘జక్కన్న’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఏరియాలవారీగా వివరాలు
‘అమీ తుమీ’ టీజర్ టాక్ : బకరా అయ్యి బాగా నవ్వించిన వెన్నెల కిషోర్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.