మెగాస్టార్ తో బన్నీ అలా

Bunny with Mega Star Chiranjeevi in Khaidi no 150

చిరంజీవి రీ ఎంట్రీపై ఇటు ఫ్యాన్సే కాదు అటు మెగా ఫ్యామిలీ హీరోలు కూడా చాలా ఆసక్తిని చూపారు. అభిమానులందరూ సినిమా కోసం చూస్తే, మెగా హీరోలు సినిమా కంటే ముందే అందులో నటించాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ఆఫర్‌ కేవలం రామ్‌చరణ్‌కు మాత్రమే వచ్చిందని, ఇందులో ఒక సాంగ్‌లో చెర్రీ కనిపిస్తాడని, మిగతా ఎవ్వరూ ఉండరని దర్శకుడు వినాయక్‌ కూడా ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇందులో బన్నీ కూడా ఉన్నాడట.

ఈ విషయాన్నిచిరంజీవే స్వయంగా తెలిపారు. ఇందులో బన్నీ కూడా కాసేపు కనిపించనున్నాడని చిరంజీవి చెప్పారు. సినిమా స్టార్టింగ్ లో బన్నీ ఓ కామియో రోల్ చేస్తున్నాడని తెలిసింది. దీంతో ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు మెగా అభిమానులు. తమిళ ‘కత్తి’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కగా ఇందులో చిరు సరసన కాజల్‌ నటించింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన చాలా మంది హీరోలు స్క్రీన్ మీద చిరంజీవితో పాటు తళుక్కుమననున్నారు. మొత్తానికి తన మామయ్య చిరంజీవితో కలిసి స్క్రీన్ చేసుకునే అవకాశం బన్నీకి రావడం, మెగా అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.