‘ఛలో’ 24 డేస్ కలెక్షన్స్.. డబుల్ లాగిన నాగశౌర్య

యంగ్ లవర్‌బాయ్ నాగశౌర్య ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ లభించలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినా.. వాటిల్లో చాలావరకు ఫ్లాప్‌గా నిలిస్తే కొన్ని మాత్రమే యావరేజ్‌గా నిలిచాయి. అంతే తప్ప శౌర్య గ్రాఫ్‌ని పెంచే హిట్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళకి అతనికి ఆ ఆకలి తీరింది. ‘ఛలో’ చిత్రం రూపంలో తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే బ్రహ్మాండమైన హిట్ దొరికింది.

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా డెబ్యూ డైరెక్టర్ వెంకీ కుడుములు ‘ఛలో’ చిత్రాన్ని ఎంటర్టైనింగ్‌గా రూపొందించడంతో.. బాక్సాఫీస్ వద్ద పోటీ వున్నప్పటికీ ఈ చిత్రం తన సత్తా చాటుకోగలిగింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్లే రాబట్టింది. ఎంతో నమ్మకంగా బయ్యర్లు పెట్టిన రూ.6 కోట్ల పెట్టుబడిని ఫస్ట్ వీక్‌లో రికవర్ చేయడంతోపాటు.. ఆ తర్వాతి రోజుల్లోనూ డీసెంట్ వసూళ్ళు కొల్లగొడుతూ రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం మొత్తం 24 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.11.70 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కొల్లగొట్టింది. ఈ మూవీతో శౌర్య తొలిసారి తన కెరీర్‌లో అతిపెద్ద విజయం సాధించడమే కాకుండా రూ.10 కోట్ల క్లబ్‌లోకి చేరాడు. విశేషం ఏమిటంటే.. ఇప్పటికీ ఈ చిత్రం కొన్ని ఏరియాల్లో డీసెంట్ రన్‌తో ప్రదర్శింపబడుతోంది.

ఏరియాలవారీగా 24 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
ఏపీ+తెలంగాణ : 8.55
ఓవర్సీస్ : 2.40
రెస్టాఫ్ ఇండియా : 0.75
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ.11.70 కోట్లు (షేర్)

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.