ఛలో ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛలో’ గత శుక్రవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌పై మొదట్నుండీ మంచి అంచనాలు నెలకొన్నాయి. మహతి స్వరసాగర్ అందించిన క్యాచీ పాటలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవడంతో ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాగశౌర్య స్టైలిష్ లుక్, రష్మిక మంథన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా కథలో కూడా మంచి బలం ఉండటంతో ఈ సినిమా చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

ఛలో సినిమాకు పాజిటివ్ రివ్యూస్‌ రావడంతో పాటు మౌత్ టాక్‌ కూడా బాగా ఉపయోగపడింది. దీంతో ఈ చిత్రం మొదటి వారం ముగిసేసరికి రూ. 8 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇది నాగశౌర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ అని చెప్పాలి. భాగమతి తరువాత తెలుగులో హిట్ అయిన రెండో సినిమాగా ఛలో నిలిచింది. ఈ చిత్ర ఏరీయాలవారీ మొదటివారం కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్‌వీక్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 1.75 కోట్లు
సీడెడ్ – 0.75 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.92 కోట్లు
గుంటూరు – 0.54 కోట్లు
తూర్పు గోదావరి – 0.54 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.42 కోట్లు
కృష్ణా – 0.59 కోట్లు
నెల్లూరు – 0.22 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 5.73 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.50 కోట్లు
ఓవర్సీస్ – 1.90 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 8.13 కోట్లు

Related posts:
మాట ఇచ్చి త‌ప్పిన మ‌హేష్‌
40 గంటల్లో 1 మిలియన్ వ్యూస్‌.. మరో రికార్డ్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్
130 కోట్ల తో జై లవకుశ నాన్ బాహుబలి రికార్డులు కొట్టేశాడు.. షేర్ కలెక్షన్లు కూడా దుమ్ము లేపాడు !!
బాలయ్య విలన్‌కే మెగాస్టార్ ఓటు!
‘అజ్ఞాతవాసి’ టీజర్ రివ్యూ-రేటింగ్ : వీడి చర్యలు ఊహాతీతం
గుడ్ బై చెప్పేసిన అనసూయ.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.