ఛలో వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. దుమ్ములేపిన శౌర్య!

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ఛలో ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో నాగశౌర్య బిగ్గెస్ట్ హిట్ కొట్టాడని చెప్పాలి. అతడి కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఇదే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో వచ్చిన సినిమాల్లో ఇది రెండో సూపర్ హిట్‌గా నిలవడంతో నాగశౌర్య ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. రిలీజ్‌కు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఛలో రిలీజ్ తరువాత కూడా అంతే స్థాయిలో అలరించడంతో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది.

ఈ చిత్రం టోటల్ రన్‌లో రూ. 12 కోట్లకు పైగా కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. భాగమతి తరువాత ఈ ఏడాదిలో రెండో సూపర్ హిట్ చిత్రంగా ఛలో రికార్డు కొట్టింది. ఈ సినిమాతో నాగ శౌర్య కూడా చాలా గ్యాప్ తరువాత హిట్ కొట్టి సత్తా చాటుకున్నాడు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక మంధన హీరోయిన్‌గా నటించగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఛలో చిత్ర వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – క్లోజింగ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 3.00 కోట్లు
సీడెడ్ – 1.15 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.50 కోట్లు
గుంటూరు – 0.70 కోట్లు
తూర్పు గోదావరి – 0.70 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.60 కోట్లు
కృష్ణా – 0.82 కోట్లు
నెల్లూరు – 0.30 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 8.77 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.75 కోట్లు
ఓవర్సీస్ – 2.80 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 12.32 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.