చల్తే చల్తే మూవీ రివ్యూ – రేటింగ్

చిన్నసినిమాగా తెరకెక్కిన ‘‘చల్తే చల్తే’’ ఇండస్ట్రీ వర్గాల్లో తనదైన మార్క్ వేసుకుంది. పోస్టర్స్, టీజర్‌తో ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన చల్తే చల్తే భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
ఫారిన్ నుండి ఇండియాకు వచ్చిన శృతి(ప్రియాంక జైన్)ను కారు డ్రైవర్ రూపంలో దర్శనిమిచ్చిన సంతోష్(విశ్వదేవ రాచకొండ) మొదటిచూపులోనే ప్రేమిస్తాడు. తన నానో కారును బిఎమ్‌డబ్య్లూ‌గా మార్కెటింగ్ చేసి ఆమెను తన ట్యాక్సీలో ఎక్కించుకుని నాలుగు గంటల ప్రయాణం మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో ఆ డొక్కు నానో కారులో విసిగుకుంటూ శృతి తన ప్రయాణం సాగిస్తుంది. తనను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని నానా పాట్లు పడతాడు సంతోష్. కానీ అతడిపై ఎలాంటి ఫీలింగ్ లేని శృతి తన ప్రేమను అంగీకరించదు. ఈ క్రమంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. సంతోష్ చేసిన త్యాగానికి ఫిదా అయిన శృతి అతడికి తన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తన ప్రేమను త్యాగం చేస్తుంది. శృతి ఎందుకోసం తన ప్రేమను త్యాగం చేసింది..? సంతోష్ చేసిన త్యాగం ఏమిటీ..? వీరి ప్రేమకు అడ్డంగా ఉన్నది ఎవరు..? సంతోష్ తన ప్రేమను దక్కించుకుంటాడా లేదా..? అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ:
టాలీవుడ్‌లో ప్రేమకథలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుంది. ఈ సూత్రాన్ని నమ్ముకునే వచ్చిన స్వీట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ ‘‘చల్తే చల్తే’’. దర్శకుడు ప్రదీప్ కోనేరు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ముందు నుండీ మంచి అంచనాలను క్రియేట్ చేసింది. సింపిల్ అండ్ స్వీట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన ప్రదీప్‌ను పలు విషయాల్లో మనం ఖచ్చితంగా అభినందిస్తాం. ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఫారిన్ నుండి వచ్చిన శృతిని చూసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నుండి ఉన్నపలంగా ట్యాక్సీ డ్రైవర్ అవతారమెత్తుతాడు సంతోష్. శృతిని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలని ఆమెతో కారులో ప్రయాణం స్టార్ట్ చేస్తాడు మన హీరో.

ఈ క్రమంలో వారు చేసే ప్రయాణంలో కలిగే ఇబ్బందులు, వాటిని వారు ఎదుర్కున్న తీరు మనల్ని అలరిస్తాయి. ఒకానొక సమయంలో శృతిని కాపాడేందుకు సంతోష్ టైటానిక్ సినిమా లెవెల్‌లో ఒక త్యాగానికి పూనుకుంటాడు. ఇలా అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు. కట్ చేస్తే.. సంతోష్ చేసిన త్యాగానికి ఇంప్రెస్ అయిన శృతి అతడిని ప్రేమిస్తుంది. కానీ అప్పుడే విలన్ వారి ప్రేమలోకి ఎంటర్ అవుతాడు. ఇది మూవీలోనే అతిపెద్ద ట్విస్టు అని చెప్పాలి. కట్ చేస్తే.. శృతి తన ప్రేమను త్యాగం చేసిన పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తుంది. అదే విధంగా తన ప్రేమను తిరిగి దక్కించుకునే సంతోష్ వ్యక్తిత్వం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. చివరికి ఈ ప్రమే జంట కలిసిన విధానం అద్భుతంగా ఉండటంతో సదరు ప్రేక్షకుడు థియేటర్ నుండి ఆనందంగా బయటకు వస్తాడు.

నటీనటులు పర్ఫార్మెన్స్:
ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఆర్టిస్టు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లుగా విశ్వదేవ రాచకొండ, ప్రియాంక జైన్‌లు అద్భుతంగా నటించారు. వారు చూపించిన వర్క్ డెడికేషన్ ఈ సినిమాలో మనకు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒక సరదా కుర్రాడి పాత్రలో చాలా ఎనర్జెటిక్‌గా నటించాడు విశ్వదేవ్. కొన్ని సీన్స్‌లో అతడి పర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతారు. ఇక హీరోయిన్‌గా ప్రియాంక జైన్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఎమోషనల్ సీన్స్‌లో ఈమె యాక్టింగ్ నిజంగా సూపర్బ్. హీరో తండ్రిగా రావు రమేష్ చేసిన పాత్ర ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఊపిరికంటే కూడా వాల్యూకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిగా రావు రమేష్ ఇరగదీశాడు. హీరోయిన్ తండ్రిగా షాయాజీ షిండే కూడా తనదైన యాక్టింగ్‌తో వన్నె తెచ్చాడు. మిగతా నటీనటులు వారికి ఇచ్చిన పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
చల్తే చల్తే సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. దర్శకుడు చెప్పిన ప్రతి సన్నివేశాన్ని మనకు చాలా అద్భుతంగా ఈయన తన కెమెరాలో బంధించాడు. ప్రతి ఫ్రేమ్‌ను చాలా కలర్‌ఫుల్‌గా చూపించారు వెంకట్. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో వెంకట్ పనితనం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ సంగీతం. కేవలం పాటలే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దర్శకుడు ప్రదీప్ కోనేరు. దర్శకుడిగా ఈయన తీసుకున్న జాగ్రత్తలు, చూపించిన డెడికేషన్ వావ్ అనిపిస్తుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గ స్థాయిలో చాలా బాగున్నాయి.

చివరిగా: వాల్యూ ఉన్న డైలాగ్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఈ వీకెండ్ ఫ్యామిలీతో ‘‘చల్తే చల్తే’’!

నేటిసినిమా రేటింగ్: 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.