నటి ప్రగతి ఫ్లాష్‌బ్యాక్.. వింటే షాక్!

ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్న ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఒక ఫ్లాష్‌బ్యాక్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఏం చేసేవారు? ఈ పొజిషన్‌కి ఎలా చేరుకున్నారు? ఈ ప్రయాణంలో ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నారు? అనే ఆసక్తికరమైన టాపిక్స్ ఉంటాయి. లేటెస్ట్‌గా నటి ఆర్టిస్ట్ అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని మీడియాతో పంచుకున్నారు. తన ఫ్లాష్‌బ్యాక్ గురించి చెప్పి.. ‘వామ్మో’ అనిపించేలా షాక్‌‌కి గురి చేశారు.

తనకు 17 ఏళ్ళు ఉన్నప్పుడే తమిళంలో కథానాయికగా నటించానని, అనంతరం రెండేళ్ళ వ్యవధిలో ఏడు సినిమాల్లో హీరోయిన్‌గా పనిచేశానని ప్రగతి తెలిపింది. ఆ సమయంలో తన కెరీర్ సాఫీగానే సాగిందని.. కాకపోతే సినిమాలు తనకు సరిపడవన్న అభిప్రాయంతో 20 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసుకున్నానని.. ఇంకో ఏడాదికే తల్లినయ్యానని ఆమె పేర్కొంది. అయితే.. కొన్నాళ్ళు గడిచాక మళ్ళీ తనకు సినిమాలపై ఆసక్తి పుట్టిందని, దాంతో ఆఫర్ల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టానంది. అప్పట్లో ఆశించినస్థాయిలో ఛాన్సులు రాకపోవడంతో సీరియల్స్ చేయడం స్టార్ట్ చేశానని.. ఆపై సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ వచ్చాయని ప్రగతి వెల్లడించింది.

ఈ నేపథ్యంలోనే తన కాలేజీ రోజుల్ని కూడా ప్రగతి గుర్తు చేసుకుంది. ఆ రోజుల్లో తాను చాలా వయొలెంట్‌గా ఉండేదాన్నని.. అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడినా, టీజ్ చేసినా అక్కడికక్కడే అబ్బాయిల్ని కొట్టేదాన్నని.. దాంతో తనకు ‘రౌడీ గంగమ్మ’ అనే పేరు వచ్చిందని ప్రగతి వెల్లడించింది. ఒక గ్యాంగ్ కూడా వేసుకుని తిరిగేదాన్నని.. అందుకే తనను చూసి అందరూ భయపడేవాళ్లని ప్రగతి చెప్పింది.

Related posts:
ఫేస్‌బుక్ పోస్ట్.. ఓ యువతికి ఆరునెలల జైలు శిక్ష పడేలా చేసింది!
వాకాలో వీరబాదుడుతో సరికొత్త రికార్డ్ సృష్టించిన రో‘హిట్’
హీరోయిన్ శ్వేతా మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. పోలీస్ స్టేషన్‌లోనే తల్లీకూతుళ్ళ ఫైట్
ఆ పత్రికకు వార్నింగ్ ఇచ్చిన హీరో సూర్య
మార్చి 2 నుంచి టాలీవుడ్ బంద్.. కారణాలివే!
ఆ ‘గాలి’ వార్తని ‘ఊదేసిన’ అల్లరి నరేష్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.