బాలయ్యకు చిరు కాపీ.. ఇదో పెద్ద తలనొప్పి!

ఈరోజుల్లో మన స్టార్ హీరోలు ప్రేక్షకుల్ని మెప్పించడం కోసం తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి బాగా శ్రమిస్తున్నారు. నటన, డ్యాన్స్ పరంగా ఆల్రెడీ టాప్ మార్కులు వేయించుకున్న హీరోలు.. ఇప్పుడు స్టంట్స్ కూడా డూప్స్ లేకుండా తామే స్వయంగా చేస్తున్నారు. నిజానికి.. వీరికున్న స్టార్ స్టేటస్‌కి ఇంతలా కష్టపడాల్సిన అవసరం లేదు. అయినా చేయడానికి సిద్ధమవుతున్నారంటే.. వీళ్ల డెడికేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

యంగ్ హీరోస్‌ని పక్కనపెట్టేద్దాం.. ఆరుపదుల వయస్సు దగ్గరపడుతున్న బాలయ్య కూడా ఇప్పటికీ డూప్స్ లేకుండా భారీ యాక్షన్ సీన్లు చేస్తున్నారు. దర్శకులు వద్దని విన్నవిస్తున్నా.. ‘ఏయ్, నేను చేస్తా’నంటూ ముందుకు దూసుకుపోతున్నారే తప్ప వెనకడుగు వేయడం లేదు. ఇప్పుడు చిరంజీవి కూడా ఆయనలాగే సాహసం చేసేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం. అవును.. తన తదుపరి చిత్రం ‘సైరా’ కోసం ఆయన డూప్స్ లేకుండానే స్టంట్స్ చేసేందుకు రంగంలోకి దిగనున్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మేకప్ కోసం చిరు దాదాపు మూడు గంటలపాటు మేకప్ రూంలోనే కూర్చోవాల్సి వస్తోంది. ఈలోపు కొన్ని చిన్న షాట్స్‌ని డూప్‌ని పెట్టి తీద్దామని డైరెక్టర్ భావించాడు. కానీ చిరు అందుకు ఒప్పుకోలేదు. అలా చేస్తే.. పాత్రలో తన బాడీ లాంగ్వేజ్, స్టైల్ మిస్సవుతుందని.. ఆ సీన్లను కూడా తానే చేస్తానని చిరు చెప్పినట్లు తెలిసింది. దీన్నిబట్టి.. పనిపట్ల ఆయనకున్న ఆ డెడికేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు.

అయితే.. చిరంజీవి సినిమాలకు పదేళ్లకుపైగానే గ్యాప్ ఇచ్చారు. పైగా.. ఆయన వయసు కూడా చాలా ఎక్కువ. ఈ టైంలో డూప్స్ లేకుండా ఇంతలా కష్టపడడం రిస్క్‌తో కూడుకున్న పనే!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.