అప్పుడు.. ఇప్పుడు.. సేమ్ టు సేమ్.. చిరులో నో ఛేంజ్!!

Chiranjeevi Live Dance Performance At CineMaa Awards Event

మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన సున్నితమైన మూవ్స్‌తో ఇతరులను కట్టిపడేసే చిరు డ్యాన్స్‌కి అప్పట్లో ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ స్టార్స్ కూడా అభిమానులే. అంత అద్భుతంగా డ్యాన్స్ చేసే చిరులో ఆ ప్రతిభ ఇప్పటికీ తగ్గలేదని ఆయన మరోసారి నిరూపించుకున్నారు.

సిని‘మా’ అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకి స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసిన చిరంజీవి.. స్టేజ్‌పై లైవ్ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చి ఆ ఈవెంట్‌ని మరింత ఎంటర్టైన్‌గా మార్చేశారు. ముందుగా మెగాస్టార్ కి సంబంధించిన ఓ మెడ్లే… వాటికి మెగా ఫ్యామిలీ హీరోల పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత చిరు సందడి మొదలైంది. స్టేజ్‌పైకి వచ్చి రెండుమూడు మాటలు అందరితో పంచుకున్న తర్వాత చిరు తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ స్టార్ట్ చేశారు. గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రి మూవీలలోని టైటిల్ సాంగ్స్‌తో పాటు.. తన పాటలతో కూర్చిన ఓ మెడ్లేకు కూడా చిరు చిందులేశారు. 15 నిమిషాలపాటు జరిగిన చిరు డ్యాన్స్.. అందరినీ ఎంటర్టైన్ చేసేసింది.

60 ఏళ్ళ వయస్సులోనూ చిరు తన బాడీని బెండ్ చేయడం.. సున్నితంగా డ్యాన్స్ చేస్తున్న విధానం.. బీట్‌కి తగ్గట్టు మూవ్స్.. ముఖంలో పలికే ఎక్స్‌ప్రెషన్స్ తీరు చూసి అందరూ అవాక్కయ్యారు. గతంలో ఎలా డ్యాన్స్ చేసేవారో.. ఇప్పటికీ అదే ప్రతిభతో అందరినీ మైమరిపించారు. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ అయితే.. విపరీతంగా ఎగ్జైట్ అయ్యారు. చిరు డ్యాన్స్ చేస్తున్నంత సేపు.. ఆడిటోరియం అంతా ఈలలు కేకలతో దద్దరిల్లిపోయింది.

CLICK HERE to watch CHIRANJEEVI DANCE PERFORMANCE

Related posts:
యూఎస్‌లో బాహుబ‌లి మానియా: ప్రీమియ‌ర్ షోల‌తో పాత రికార్డుల‌కు పాత‌ర‌
‘బ్రహ్మోత్సవం’ ప్రీ-రిలీజ్ బిజినెస్ @ 100 కోట్లు?
రికార్డుల వేట మొదలెట్టిన ‘ధృవ’.. అక్కడ ఆ మైలురాయి గ్యారెంటీ
బాలయ్య కోసం విలన్‌గా మారిన చిరంజీవి తమ్ముడు
భాగమతి‌ బండారం బట్టబయలు.. అనుష్క ఇలా చేసిందా?
ఆ గ్యాంగ్‌‌కి తోపు నేనే అంటున్న బ్యూటీ!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.