మెగాస్టార్ అల్లుడు.. అప్పుడే మొదలెట్టాడు!

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త క‌ల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతూ ఇటీవల ఒక సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మెగా అల్లుడిగా తెరకంగేట్రం చేస్తున్న కళ్యాణ్ దేవ్ హిట్ కొట్టడం ఖాయం అని అన్నారు మెగా ఫ్యాన్స్. కాగా ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ పనులు ముగించుకుంది.

తాజాగా ఈ చిత్రం కోసం డబ్బింగ్ మొదలెట్టాడు కళ్యాణ్. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం వారు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తన తొలిసినిమా అయినా కూడా కళ్యాణ్ దేవ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. కాగా ప్రస్తుతం తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ హీరో.

సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేం హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.