చిరు ఇంట్లో మొదలైన శ్రీజ రెండో పెళ్ళి సందడి..

Srija Marriage Arrangements

Chiranjeevi Started Daughter Srija Marriage Arrangements

మెగాకుటుంబంలో త్వరలోనే ఓ శుభకార్యం జరగనుందని, చిరంజీవి రెండోకుమార్తె శ్రీజకి రెండో పెళ్ళి ఫిక్స్ అయ్యిందని గతకొన్నాళ్ళ నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ విషయంపై ఎవరూ స్పందించకపోవడంతో ఇప్పటివరకు పుకార్లేనని అనుకున్నారు. కానీ.. ఆ వార్త నిజమేనని తాజాగా రుజువయ్యింది. రాంచరణ్ పెళ్ళి జరిగిన మూడేళ్ళ తర్వాత ఆ ఇంట్లో ఇన్నాళ్ళకు కూతురు శ్రీజ పెళ్ళి హంగామా మొదలైంది.

చిత్తూరుకు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ని శ్రీజకి భర్తగా, తన అల్లుడుగా చిరంజీవి తెచ్చుకుంటున్నారు. ఇదివరకే ఇరుకుటుంబాలు వారిద్దరి పెళ్ళి విషయమై చర్చలు జరుపుకున్నారు. అన్నీ ఓకే అనుకున్న తర్వాత పెళ్ళి శుభకార్యాన్ని మొదలుపెట్టారు. ఈ వేడుకకు సంబంధించిన పనులన్నీ చకాచకా జరిగిపోతున్నాయి. ఈ మధ్యే కూతుళ్లు, కోడలితో కలిసి పోజు ఇచ్చిన చిరంజీవి.. ఇప్పుడు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. పెళ్ళి పందిరి, పసుపు కొమ్ములు దంచే కార్యక్రమం, ఇంకా ఇతరత్ర పనులన్నీ దగ్గరుండిమరీ చిరు చూసుకుంటున్నారు. తండ్రిగా తన బాధ్యతను మోస్తూ సంతోషాన్ని అనుభవిస్తున్నారు.

ఇక ఈ వివాహ వేడుకకు ఫిల్మ్‌ ఇండస్ట్రీకి సంబంధించిన అతిరథ మహారథులతోపాటు… వ్యాపార, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే మెగాఫ్యామిలీవారు అందరినీ ఆహ్వానించినట్లు తెలిసింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.