మెగా ఫ్యామిలీ వార్.. కొడుకు-కోడలికి చిరు వార్నింగ్!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ గురించి టాలీవుడ్‌లో తెలియని వారుండరు. అందరితో చాలా కలిసిపోయి ఉండే మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో అందరికీ చాలా ఇష్టం. ఇక మెగాస్టార్ కొడుకు-కోడలు అయిన రామ్ చరణ్, ఉపాసనల గురించి కూడా తెలిసిందే. వీరు ఒకరికి ఒకరు అనే మాటకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంటారు. అయితే తాజాగా మెగాఫ్యామిలీలో ఒక వార్ మొదలయ్యిందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో దుమారం రేపుతోంది.

రామ్ చరణ్ అండ్ ఉపాసనలకు కలిపి మెగాస్టార్ చిరంజీవి ఓ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మాట వినకపోతే ఇంటినుండి బయటికే అంటూ చిరు వారిద్దరిపై ఫైర్ అయ్యాడట. అయితే ఈ వార్నింగ్ వెనుక అసలు స్టోరీ ఏమిటంటే.. ఉపాసన చెర్రీలు ఇద్దరూ కూడా జంతు ప్రేమికులు. వారు తరుచుగా కొత్త జంతువులను ఇంటికి తీసుకొస్తున్నారట. దీంతో ఇంట్లో మనుష్యులకంటే జంతువుల సంఖ్య ఎక్కువయిపోయింది. ఇది చూసిన చిరు వారిద్దిరికీ వార్నింగ్ ఇచ్చేశాడు.

చిరు వార్నింగ్‌ను పెద్దగా పట్టించుకోని చెర్రీ ఉపాసనలు కొత్త జంతువులను ఇంటికి తెస్తూనే ఉన్నారు. అంతేగాక వాటి కోసం ఏకంగా ఓ కొత్త ఫామ్ హౌస్‌ను తీసుకునే యోచనలో ఉన్నారట. ఈ విషయాలను రామ్ చరణ్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలపడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్‌గా మారింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.