తారక్ యాక్సిడెంట్‌పై క్లారిటీ.. అసలు ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అమెరికాలో యాక్సిడెంట్‌ జరిగిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు రావడంతో యావత్ తెలుగు ఇండస్ట్రీ షాక్‌కు గురయ్యింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంలో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టెస్ట్ షూట్ కోసం అమెరికా వెళ్లారు ఈ ఇద్దరు హీరోలు. అయితే అమెరికాలో తారక్ బస చేస్తున్న హోటల్‌లో యాక్టిడెంట్‌కు గురయ్యాడని వార్తలు రావడంతో నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆందోళన చెందారు.

ఈ విషయం తెలుసుకున్న తారక్ అతడికి ఏం కాలేదని క్లారిటీ ఇచ్చాడు. తన టీమ్ ద్వారా ఈ యాక్సిడెంట్ విషయంపై తారక్ స్పందించాడు. అసలు అమెరికాలో తను ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని, తాను సురక్షితంగా ఉన్నానంటూ తారక్ టీమ్ చెప్పుకొచ్చింది. అంతేగాక తారక్ అమెరికా నుండి హైదరాబాద్ కూడా తిరిగి వచ్చేశాడని, ప్రస్తుతం తన ఫిట్‌నెస్ ట్రెయినింగ్‌లో పాల్గొంటున్నాడని వారు వెల్లడించారు. ఇలా తారక్ యాక్సిడెంట్‌పై క్లారిటీ రావడంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.

ఇక తారక్ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ కోసం కూడా తారక్ రెడీ అంటున్నాడు.

Related posts:
‘24’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. సూర్య కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్
ప్రభాస్, మహేష్‌లపై రామ్ చరణ్ హాట్ కామెంట్స్
చరిత్ర సృష్టించిన నాగ్ సినిమా.. ‘గ్యారేజ్’ రికార్డ్ బ్రేక్
‘కాటమరాయుడు’ ట్రైలర్ రివ్యూ : కోపాన్ని, ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో
వెంకటేష్, రితికా సింగ్‌ల ‘గురు’ మూవీ రివ్యూ-రేటింగ్
సూర్యకాంతంగా మారిన మెగా డాటర్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.