మామ-అల్లుడు మధ్య మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..?

Cold War Between Pawan Kalyan and Allu Arjun

Cold War Between Pawan Kalyan and Allu Arjun

మెగస్టార్ చిరంజీవి తరువాత మెగా ఫ్యామిలీలో ఆ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. అయితే వీరిద్దరిలో ఎవరి స్టైల్ వారికున్నా…ఎవరి ఇమేజ్ వారికుంది. అయితే వీరి తరువాత ఇండస్ట్రీకి ఎంత మంది మెగా హీరోలు వచ్చినా మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత మెగా ఫ్యాన్స్‌ని అంతగా అలరించింది మాత్రం ఒక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు.

తనదైన నటనతో అల్లు అర్జున్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయినా బన్నీ మాత్రం ఏనాడు మెగాస్టార్‌ మరియు పవన్ కళ్యాణ్‌లను మరవలేదు. తన ప్రతి ఆడియో పంక్షన్‌కి వారిని పిలుస్తూనే వస్తున్నాడు. సందర్భం చిక్కినప్పుడు వారిపై ఉన్న అభిమానాన్ని అందరి ముందు వాడుకుంటున్నాడు. ఐతే ఇంత చేసినా గత కొంత కాలంగా అల్లు అర్జున్‌ని పవన్ కళ్యాణ్ దూరం పెట్టాడన్న వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల సర్దార్ గబ్బర్‌సింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ప‌వ‌న్ మాట్లాడుతూ తాను ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్‌ లాగా డ్యాన్సులు చేయ‌లేన‌ని ఓపెన్‌గా చెప్పాడు. అయితే డాన్స్‌ అంటే ప్రాణంగా జీవించే అల్లు అర్జున్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

దీంతో బ‌న్నీ కాస్త ఫీల‌య్యాడ‌ని సమాచారం. ఇదే విష‌యాన్ని త‌న స్నేహితుల ద‌గ్గర చెప్పుకొని బాధపడ్డాడంట బన్నీ. మరి పవర్ స్టార్ స్టైలిష్ స్టార్ మధ్యలో నిజంగా కోల్డ్ వార్ అనేది ఉంటే.. అది ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.