స్పైడర్లు వచ్చినా.. మహానుభావులు వచ్చినా.. హీరో నేనే.. విలనూ నేనే!!

dasaraa winner

మూడు పాత్రలు.. ఒకటి సాత్వికం.. రెండవది కొంటెతనం.. మూడవది క్రూరత్వం.. మూడు పాత్రలు ఒకే గెటప్ లో, అలా తెరపై మనముందు కదలాడే సన్నివేశాల్లో మూడు వేర్వేరు పాత్రలే మనకు కనిపించాయి.. ఏమాత్రం ఎవరెవరో అనే సందేహం మనకి ఎంతమాత్రం రానివ్వకుండా ఆ పాత్రలలో జీవించిన నటరుద్ర ఎన్టీఆర్ ని ఎంతపొగిడినా తక్కువే. తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ కి అంత్యంత పోటీదారులుగా భావించే మెగా ఫ్యామిలీ నుండి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జై లవకుశ సినిమా చూసి ఆ పాత్రలని ఈ తరంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు అని కితాబు ఇచ్చాడంటే ఎన్టీఆర్ నట విన్యాసం ఏ రకంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

పెర్ఫార్మన్స్ పరంగానే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా బయ్యర్లకి నష్టాలు రాని ప్రాజెక్ట్ గానే జై లవకుశ నిలువనుంది.ఇప్పటికే 60 కోట్ల పైగా షేర్ సాధించిన జై లవకుశ ఈ హాలిడేస్ లో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. అంతే కాదు, 120 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ సినిమా అంచనాలని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. నాలుగు రోజుల్లో 26.21 కోట్ల రూపాయల షేర్ సాధించి భారీ పరాజయం వైపుగా నిలిచింది.ఇక మారుతీ శర్వానంద్ కాంబినేషన్ లో వచ్చిన మహానుభావుడు అటు మల్టీప్లెక్స్ ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నప్పటికీ బి. సి. సెంటర్లలో ఎక్కువకాలం నిలవడం కష్టమే. మొత్తానికి దసరా పండగకి విడుదలైన మూడు చిత్రాలలో జై లవకుశ అటు పెర్ఫార్మన్స్ పరంగాను ఇటు కలెక్షన్ల పరంగాను మంచి పేరు తెచ్చుకొని దసరా విన్నర్ గా నిలిచాడు. హీరో గానే కాకుండా విలన్ పాత్రలో ఇరగదీసిన ఎన్టీఆర్ ఈ దసరాకి విన్నర్ గా నిలిచాడు. ఈ దసరా కి హీరో ఎన్టీఆరే.. విలన్ కూడా ఎన్టీఆరే.. ఏమంటారు ?

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.