హీరోయిన్ మోజులో దర్శకుడికి ‘10’ బొక్క!

ఆఫర్ల కోసం దర్శకులతోగానీ, నిర్మాతలతోగానీ హీరోయిన్లు ఎఫైర్ పెట్టుకున్న వార్తల్ని ఇప్పటివరకూ ఎన్నో విన్నాం! దీంతోపాటు తమ మోజు తీర్చినందుకుగాను ఆ భామలకు ఆఫర్లు ఇప్పించారనే న్యూస్‌లు చదివాం! బట్ ఫర్ ఏ ఛేంజ్.. ఈసారి అందరి ఫ్యూజులు ఎగిరిపోయే లేటెస్ట్ గాసిప్ ఒకటి ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ హీరోయిన్‌కి ఆఫర్ ఇప్పించడం కోసం తనే చేతుల మీదుగా రూ.10 లక్షలు సమర్పించుకున్నాడనేది ఆ గాసిప్ సారాంశం!

ఆ దర్శకుడికి మూడు సినిమాల అనుభవం ఉంది. అందులో రెండు సూపర్‌హిట్స్‌ అవ్వగా.. ఇంకొకటి యావరేజ్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడితను ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ తీసేందుకు రెడీ అవుతున్నాడు. గతేడాది వరుసగా ఆరు విజయాలు అందుకున్న నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌ని తీసుకోవాల్సిందిగా దర్శకుడు పదేపదే సూచించడంతో.. నిర్మాత ఆమెని పిలిపించాడు. సినిమా గురించి చర్చించాక.. తనకు రెమ్యునరేషన్ రూ.50 లక్షలు కావాలని ఆమె డిమాండ్ చేసింది! ఆమెకంత సీన్ లేదనుకున్న నిర్మాత.. అంత ఇచ్చుకోలేనని చెప్పి పంపించేశాడు.

ఈ విషయం తెలుసుకున్న సదరు దర్శకుడు.. మళ్ళీ నిర్మాతని సంప్రదించాడు. కనీసం రూ.20 లక్షలు కూడా మార్కెట్ వ్యాల్యూ లేని ఆ హీరోయిన్.. రూ.50 లక్షలు డిమాండ్ చేసినందుకు తీసుకోట్లేదని నిర్మాత తేల్చిచెప్పాడు. అయితే.. దర్శకుడు మాత్రం వదల్లేదు. ఆమెనే కథానాయికగా ఫైనల్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. కావాలంటే.. తన పారితోషికంలో నుంచి రూ.10 లక్షలు కంట్ చేసి, ఆమెకి రూ.30 లక్షలు రెమ్యునరేషన్ ఫిక్స్ చేయాల్సిందిగా సూచించాడు. దీంతో ఖంగుతిన్న ఆ నిర్మాత.. చివరికి చేసేదేమీ లేక ఆమెని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? ప్రస్తుతం ఆమె హిందీలో సూపర్ హిట్ అయిన ఒక సినిమా రీమేక్‌లో నటిస్తోంది. సో.. ఈపాటికే ఆ దర్శకుడు, నిర్మాత, హీరోయిన్ ఎవరో మీకు తెలిసిపోయే ఉంటుంది. ఇది సరేగానీ.. తన చేతులమీదుగా దర్శకుడు రూ.10 లక్షలు ఆమెకి సమర్పించుకోవడమే హాట్ టాపిక్! ఇక్కడే ఆ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందేమో అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.