అట్టర్ ఫ్లాప్ బ్యూటీకి అదిరిపోయే ఛాన్సులు!

తెలుగులో ఒక్కసారి సక్సెస్ అయితే హీరోయిన్లకు అదిరిపోయే ఆఫర్స్ వస్తాయి. వారి రేంజ్ కూడా అంతే స్థాయిలో పెరిగిపోతుండటంతో భీబత్సమైన క్రేజ్ వారి సొంతం అవుతుంది. అదే సక్సెస్ వారి ఫస్ట్ సినిమాతో లభిస్తే వెనక్కి తిరిగి చూడటమే ఉండదు హీరోయిన్లకు. అయితే తొలి సినిమా అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిస్తే మాత్రం ఆ హీరోయిన్ పరిస్థితి అయోమయంగా ఉంటుంది. కానీ ఒక హీరోయిన్ మాత్రం అందరికీ షాకిస్తూ దూసుకెళుతోంది.

యంగ్ హీరో నితిన్ నటించిన ‘లై’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది బబ్లీ బ్యూటీ మేఘా ఆకాష్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా కొట్టింది. దీంతో అమ్మడికి ఇక సినిమా ఛాన్సులు రావని అనుకున్నారు అందరు. కానీ వెంటనే నితిన్ నెక్ట్స్ మూవీ ‘‘ఛల్ మోహన్ రంగా’’లో కూడా హీరోయిన్‌గా మేఘా ఆకాష్ నటిస్తోంది. మెగా అల్లుడు కళ్యాణ్ డెబ్యూ మూవీలో కూడా మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో యంగ్ హీరో నిఖిల్ నటించనున్న నెక్ట్స్ మూవీలో కూడా అమ్మడే హీరోయిన్‌గా చేయనుంది.

ఇలా అట్టర్ ఫ్లాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా వరుసబెట్టి అదిరిపోయే ఆఫర్స్ దక్కించుకుంటున్న ఈ బ్యూటీని చూసి మిగతా హీరోయిన్స్ షాక్ అవుతున్నారు. మరి తన రెండో సినిమాతోనైనా మేఘా ఆకాష్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.

Related posts:
18వ ఏట‌లోనే ప్రేమ‌లో ప‌డ్డ‌ నితిన్ హీరోయిన్‌!!
అనసూయతో లేట్ నైట్ షో.. ఎంజాయ్ చేసిన వెన్నెల కిషోర్, రవి
ఎన్టీఆర్‌తో చాలా కష్టమంటున్న బ్యూటీ
‘నేను చాలా సీన్సియర్.. ప్రభాస్ కాదు’ : తూటాలు పేల్చిన రానా
రజనీకాంత్ రికమెండ్ చేసిన సినిమాని మోహన్‌బాబు చేస్తారా..?
చిక్కుల్లో ‘జై లవ కుశ’.. వెనకడుగు వేస్తున్న బయ్యర్స్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.