పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు, ఫ్యాన్సందు మెగాస్టార ఫ్యాన్స్ వేరయా అని కూడా చెప్పుకోవచ్చు. తొమ్మిది సంవత్సరాల తర్వాత తమ అభిమాన నటుడు చేస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమాను చాలా గ్రాండ్ గా వెల్ కమ్ చేస్తున్నారు. కాగా యుఎస్ఎలోని మెగా అభిమానులు ఏకంగా తమ అభిమాన నటుడి మీద ప్రేమను చాలా హుందాగా వెల్లడించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. కొంత మంది మెగా అభిమానులు విదేశీ గడ్డ మీద చిరంజీవి మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతకీ వాళ్లేం చేశారో తెలుసా?
యుఎస్ఎలోని ఒమాహాకు చెందిన తెలుగు వాళ్లు, అందునా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఓ ర్యాలీ నిర్వహించారు. కార్ బంపర్లకు మెగాస్టార్ ఖైదీ పోస్టర్ అతికించుకొని ఆ ర్యాలీ సాగింది. కాగా ర్యాలీ తర్వాత కార్లను ‘‘CHIRU’’ (చిరు) ఆకారంలో వచ్చేటట్లు పెట్టారు. ఇలా తమ అభిమాన చిరంజీవికి తమ ప్రేమను వెల్లడించారు.ఈ వీడియోను మీరూ చూడండి.