మంచు విష్ణు, రాజ్ తరుణ్‌ల ‘ఈడోరకం ఆడోరకం’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

Eedo Rakam Aado Rakam Movie Review

సినిమా : ఈడోరకం ఆడోరకం
నటీనటులు : మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారికా, హెబ్బా పటేల్, రాజేంద్రప్రసాద్ తదితరులు
డైరెక్టర్ : జి.నాగేశ్వరరెడ్డి
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
మ్యూజిక్ : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్
ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ
బ్యానర్ : ఏకే ఎంటర్టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్ : 14-04-2016

మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఈడో రకం ఆడో రకం’. కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విష్ణు సరసన సోనారికా నటించగా.. రాజ్ తరుణ్ సరసన హెబ్బా పటేల్ నటించింది. ఏకే ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ కన్ఫ్యూజన్ కామెడీ సినిమా ఈరోజు (14-04-2016) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి.. ఈ చిత్రం ఎంతవరకు ఆడియెన్స్‌ని ఆకట్టుకుందో తెలుసుకుందామా..

కథ :
బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అర్జున్ (మంచు విష్ణు), అశ్విన్ (రాజ్ తరుణ్) ఇద్దరూ అల్లరిచిల్లరగా తిరుగుతూ తమకిష్టమొచ్చినట్లుగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. కట్ చేస్తే.. అర్జున్ తన ఫ్రెండ్ పెళ్ళికి వెళతాడు. అక్కడ నీలవేణి (సోనారిక) అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. తన ప్రేమను నీలవేణికి వ్యక్తపరచగా.. ఆమె ఒప్పుకోదు. అవసరమైతే ట్రై చేసుకో అని చెబుతోంది. దాంతో.. నీలవేణిని ప్రేమలో పడేసేందుకు అర్జున్ ఎన్నో అబద్ధాలు చెబుతాడు. చివరికి తాను అనాథనని అబద్ధం చెబుతాడు. ఈ ఒక్క అబద్ధం అర్జున్, అశ్విన్‌ల కథను ఎన్నో మలుపులు తిప్పుతుంది.

మరోవైపు.. అశ్విన్‌, సుప్రియ (హెబ్బా పటేల్) ప్రేమ వ్యవహారం నడుస్తుంటుంది. కథ ఎన్నో మలుపులు తిరుగుతున్న సమయంలోనే అనుకోని పరిస్థితుల్లో అశ్విన్, నీలవేణికి భర్తగానూ.. అర్జున్, సుప్రియకి భర్తగానూ పరిచయం అవ్వాల్సి వస్తుంది. ఒకే ఇంట్లో ఈ విచిత్రమైన కథ నడుస్తుంది. ఇలా పరిస్థితుల్ని ఆ ఇద్దరూ ఎలా ఎదుర్కొన్నారు? ఇంతకీ వారు తమ భార్యల్ని ఎందుకు మార్చాల్సి వస్తుంది? చివరికి ఏమవుతుంది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ మూవీ సాగుతుంది.

విశ్లేషణ :
ఫస్టాఫ్ గురించి మాట్లాడుకుంటే.. కన్ఫ్యూజన్ కామెడీతో మొత్తం సరదాగా సాగిపోతుంది. తొలుత హీరోల పరిచయం, అనంతరం వారికి హీరోయిన్లు పరిచయం కావడం, వారి మధ్య లవ్ స్టోరీ సాగడం.. వంటి అంశాలు ఎంటర్టైనింగ్‌గా వుంటాయి. అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే పేలాయి. మధ్యమధ్యలో వచ్చే పాటలు వినసొంపుగా వుంటాయి. ప్రీ-ఇంటర్వెల్ వరకు నవ్వులు పూయిస్తూ సాగే ఈ సినిమా ఇంటర్వెల్ ఓ కన్ఫ్యూజన్ అంశంతో ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ ప్రతిఒక్కరినీ మెస్మరైజ్ చేస్తుంది.

ఇక సెకండాఫ్ గురించి చెప్పుకుంటే.. ఫస్టాఫ్‌లో మొదలయ్యే ఈ కన్ఫ్యూజన్‌కు ఇందులో మరొక కన్ఫ్యూజన్‌ను జోడించడంతో చాలాచోట్ల నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా ఇందులో ప్రముఖపాత్రలో నటించిన రాజేంద్రప్రసాద్ కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్వించేస్తుంది. ఆయన కామెడీయే ఈ సెకండాఫ్‌కి మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ప్రీ-క్లైమాక్స్ వరకు కొన్ని ట్విస్టులతోపాటు వచ్చే కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక క్లైమాక్స్ నార్మల్ ఫార్మాట్‌లోనే ముగుస్తుంది. మొత్తంగా.. ఈ సినిమా ఎంటర్టైనింగ్‌గా సాగుతూ, ఆడియెన్స్‌ని బాగానే నవ్వించేస్తుంది.

ఇక ఇందులో లోపాల గురించి చెప్పుకుంటే.. ఒకట్రెండు చోట్ల తప్ప కథలో బలమైన ఎమోషన్ ఎక్కడా లేవు. బాగా నవ్వించిన ఫస్టాఫ్‌ తర్వాత వచ్చే సెకండాఫ్‌లో అక్కడక్కడా సినిమా కాస్త పక్కదారి పట్టి బోరింగ్ అనిపిస్తుంది. మధ్యమధ్యలో కొన్ని కామెడీ సీన్స్ మరీ ఓవర్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
అర్జున్ పాత్రలో మంచు విష్ణు పూర్తిగా ఒదిగిపోయి తన కామెడీ టైమింగ్‌తో ఆడియెన్స్‌ని బాగానే నవ్వించేశాడు. అక్కడక్కడా మోహన్ బాబు స్టైల్లో చెప్పిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే అశ్విన్ పాత్రలో రాజ్ తరుణ్ బాగానే నటించాడు. ఎప్పట్లానే తన ఎనర్జీని చూపించడంతోపాటు డైలాగ్ డెలివరీలో తన ప్రతిభను మరోసారి చాటిచెప్పాడు. ఇక హీరోయిన్లైనా సోనారిక, హెబ్బా పటేల్ ఇద్దరూ తమతమ పాత్రల పరిధి బాగానే నటించారు. అందాల ఆరబోయడమే కాకుండా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక లాయర్ నారాయణ పాత్రలో నటించిన రాజేంద్రప్రసాద్ నటన ఈ మూవీకి హైలైట్. ఈ పాత్రలో ఆయన తనదైన టైమింగ్, డైలాగ్ డెలివరీతో చాలా చోట్ల నవ్వించారు. మిగతా నటీనటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి సిద్ధార్థ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సీన్స్‌ని చాలా అద్భుతంగా చూపించాడు. ఒకే ఇంట్లో జరిగే కథను సినిమాటోగ్రాఫర్ బాగానే క్యాఫ్చర్ చేశారు. అలాగే.. సాయి కార్తీక్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. టైటిల్ సాంగ్, కొక్కో కోడి పాటలు వినసొంపుగా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో కాస్త జాగ్రత్తలు తీసుకుని వుండుంటే బాగుండేది. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ఇక దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే.. కథ తెలిసిందే అయినప్పటికీ అందులో కన్ఫ్యూజన్ కామెడీని జోడించి ప్రేక్షకులను నవ్వించేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. అయితే.. కథలో ఎమోషన్‌కి కూడా కాస్త స్కోప్ ఇచ్చి వుండుంటే బాగుండేది. ఏదేమైనా.. డైరెక్టర్‌గా తన ప్రతిభను చూపించాడు.

చివరగా : ఈ కన్ఫ్యూజన్ కామెడీ బాగానే నవ్వులు పూయించింది.
ఈడోరకం ఆడోరకం మూవీ రేటింగ్ : 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.