‘అజ్ఞాతవాసి’కి బయ్యర్ ప్రాణాలు బలి.. నిర్మాత చెప్పిన షాకింగ్ నిజం!

అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ‘అజ్ఞాతవాసి’ ఘోరంగా విఫలం కావడంతో.. ఆ చిత్రం హక్కుల్ని భారీ రేటుకి విక్రయించిన ఓ బయ్యర్ ఆత్మహత్య చేసుకున్నాడని స్వయంగా ఒక నిర్మాత ప్రెస్‌మీట్ సాక్షిగా వెల్లడించాడు. అంతేకాదు.. మరో ఎగ్జిబిటర్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, అయితే చివరి నిముషంలో అతను బతికి బయటపడ్డాడని తెలిపాడు. ఇంతకీ ఈ విషయాల్ని బయటపెట్టిన ఆ నిర్మాత ఎవరనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. నట్టి కుమార్!

ఈనెల 2వ తేదీ నుంచి డిజిటిల్ సర్వీస్ ప్రొవైడర్లకు వ్యతిరేకంగా సమ్మె జరిగిన నేపథ్యంలో.. ఈ విషయంపై స్పందించేందుకు నట్టికుమార్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొందరు బడా నిర్మాతలు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు కొమ్ము కాయడం వల్లే వాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారని.. డబ్బులు దండుకుంటూ నిర్మాతల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించాడు. ఇలా ఈ విషయం మీద మాట్లాడుతూనే ఆయన ‘అజ్ఞాతవాసి’ టాపిక్‌ని మధ్యలోకి తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు కూడా వేశాడు.

‘అజ్ఞాతవాసి’ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కొంత పరిహారం అందిస్తానని నిర్మాత హామీ ఇచ్చారని.. కానీ ఇంతలోనే ఒక ఎగ్జిబిటర్ ఆత్మహత్య చేసుకున్నాడని నట్టి తెలిపాడు. మరో ఎగ్జిబిటర్ కూడా స్యూసైడ్ అటెంప్ట్ చేసినట్లు ఆయన చెప్పాడు. ప్రజలకు న్యాయం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్.. తొలుత ‘అజ్ఞాతవాసి’ వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని నట్టికుమార్ డిమాండ్ చేశాడు.

నిజానికి.. ‘అజ్ఞాతవాసి’ వల్ల నష్టపోయిన వారికి దాదాపు పరిహారం ఇచ్చినట్లు ఇదివరకు ప్రచారం జరిగింది. పవన్ స్వయంగా కలగజేసుకునిమరీ నష్టపోయిన వారికి డబ్బులందేలా చూసుకున్నాడని టాక్ వినిపించింది. కానీ.. ఇంతలోనే ఓ ఎగ్జిబిటర్ చనిపోయాడని నట్టి చెప్పడం సంచలనంగా మారింది. ఈ లెక్కన.. ఇప్పటివరకూ ఆ చిత్ర నిర్మాత నష్టపరిహారం చెల్లించలేదా?

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.