టప్‌మని పేలిన ‘మహా’లైట్.. అదంతా పచ్చి అబద్ధం!

పెద్ద సినిమాల బిజినెస్ దాదాపు రిలీజ్‌కి ముందే కంప్లీట్ అయిపోతుంది. కానీ.. కొన్ని సినిమాల విషయంలో మాత్రం థియేట్రికల్ బిజినెస్ మినహా, ఇతర హక్కులు అమ్ముడుపోవు. ఆయా సినిమాలకు రిలీజ్‌కి ముందు పెద్దగా క్రేజ్ ఉండకపోవడం వల్లే అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి. రిలీజయ్యాక ఫ్లాప్ టాక్ వస్తే వాటిని పెద్దగా పట్టించుకోరు కానీ.. అదే హిట్ టాక్ వస్తే మాత్రం హక్కుల కోసం ఇరగబడతారు. ముఖ్యంగా.. శాటిలైట్ రైట్స్ కోసం టివి చానెల్స్ పోటీపడతాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి వాతావరణమే ‘మహానటి’ విషయంలో రిపీట్ అయ్యింది.

రిలీజ్‌కి ముందు ఈ చిత్రంపై పెద్దగా బజ్ లేకపోవడం వల్లే శాటిలైట్ రైట్స్ కోసం ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కానీ.. రిలీజయ్యాక బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తుండడంతో.. శాటిలైట్ హక్కుల కోసం టివి చానెళ్ళు ఎగబడుతున్నాయి. భారీ మొత్తం సమర్పించుకునేందుకు సైతం రెడీగా వున్నారు. ఈ హడావుడి కారణంగా ‘శాటిలైట్’ డీల్ ఓకే అయ్యిందని.. జీ తెలుగు ఛానెల్ అక్షరాల రూ.11 కోట్లకు కొనుగోలు చేసిందని ఓ వార్త బయటికొచ్చింది. ఇదంతా నిజమేనని అంతా అనుకున్నారు కానీ.. ఇంతలోనే ఇదంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలింది.

జీ తెలుగు ఛానెల్‌, మేకర్స్‌కి మధ్య చర్చ జరిగిన మాట వాస్తవమే కాదు.. డీల్ ఓకే అవ్వలేదని తెలిసింది. ఇందుకు కారణం.. నిర్మాతలు రూ.18-19 కోట్లు డిమాండ్ చేయడమే! ‘జీ’ వారు రూ.11 కోట్ల ఫిగర్ చెప్తే.. అందుకు మేకర్స్ ఒప్పుకోలేదని.. తాము డిమాండ్ చేసినంత అమౌంట్ ఇస్తేనే రైట్స్ ఇస్తామని చెప్పారట! దీంతో.. అంత మొత్తం పెట్టలేక సదరు ఛానెల్ వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. మరి.. నిర్మాతల డిమాండ్ మేరకు అంత మొత్తం సమర్పించుకుని ఏ ఛానెల్ వాళ్ళు శాటిలైట్ హక్కులు తీసుకుంటారో చూడాలి!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.