ఎట్టకేలకు ఆ హీరోకి హలో చెప్పిన కొరటాల

‘భరత్ అనే నేను’ తర్వాత తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ కోసం ఎవరినైతే దర్శకుడు కొరటాల శివ సంప్రదించాడో.. ఆ హీరోలందరూ అతనికి హ్యాండ్ ఇచ్చేశారు. వేరే దర్శకులతో కమిట్ అయి.. ఆ ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. ఖాళీగా ఎవరున్నారా? అని జల్లడ పడితే.. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ ఫ్రీగా ఉన్నాడనే విషయం తెలిసింది. అంతే.. అతనితో చర్చలు జరిపి.. సెట్స్ మీదకి సినిమాని తీసుకెళ్ళాలని ప్లాన్‌లు కూడా వేసుకున్నాడు. కానీ.. చివరి నిముషంలో బన్నీ కూడా హ్యాండ్ ఇవ్వడంతో.. కొరటాలకి వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

ఇక అప్పట్నుంచి ఈ దర్శకుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ హీరోతో చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆమధ్య అఖిల్‌తో చేతులు కలిపే ఛాన్స్ ఉందని.. పైగా నాగ్ భారీ ఆఫర్ కోట్ చేశాడు కాబట్టి ఆ కాంబో కుదరే అవకాశం వున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. ఎందుకో కొరటాల సడెన్‌గా బ్యాక్‌స్టెప్ వేశాడు. సో.. ఆ తర్వాత నుంచి మళ్లీ కొరటాల ఎవరితో నెక్ట్స్ మూవీ తీస్తాడా? అనేది మళ్ళీ సస్పెన్స్‌గా మారింది. ఎట్టకేలకు ఆ మిస్టరీకి ఇప్పుడు తెరపడింది. ఎందరో హీరోలను పరిశీలించిన అనంతరం చివరికి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఓ హీరోని కన్ఫమ్ చేశాడు కొరటాల శివ! అతనెవరో కాదు.. నేచురల్ స్టార్ నాని!

అఫ్‌కోర్స్.. నాని మరీ పెద్ద స్టార్ ఏమీ కాదు కానీ, అతనికంటూ ఓ మార్కెట్ ఉంది. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ వుంది. సో.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి ఇతనే కరెక్ట్ ఛాయిస్ అనుకుని.. కొరటాల అతడ్ని సంప్రదించాడు. తన దగ్గరున్న స్టోరీలైన్‌ని వినిపించాడు. ఇంకేం.. కథ నచ్చడంతోపాటు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మూవీకి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.