ఆ హీరోతో సాయిపల్లవి ఎఫైర్.. ‘గంట’ కొట్టిన మంత్రి!

సెలబ్రిటీలపై రూమర్లు రావడం సహజం! సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు తలా, తోకకి సంబంధం లేని వార్తల్ని సృష్టించేస్తున్నారు. చాలావరకు వీటిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు కానీ.. కొన్ని రూమర్స్ మాత్రం జనాల అటెన్షన్‌ని రాబడుతాయి. అలాంటి కోవకు చెందిందే ఈ లేటెస్ట్ రూమర్!

గత రెండు రోజుల నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవికి, హీరొయిన్ సాయి పల్లవికి మంచి సాన్నిహిత్యం వుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మొదట దీన్ని ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు కానీ.. కొన్ని పేరున్న వెబ్‌సైట్స్‌లోనూ ఈ వార్త రావడంతో ఇది చర్చకు దారితీసింది. అసలెప్పుడు కలిసి కెమెరా కంటికి కనిపించని వీరి మధ్య నిజంగానే పప్పులు ఉడుకుతున్నాయా? అనే అనుమానాలు ఎక్కువైపోయాయి. ఇది ఈ నోటా ఆ నోటా చక్కర్లు కొడుతూ చివరికి గంటా వారింటికి చేరింది.

దీంతో ఖంగుతున్ని గంటా శ్రీనివాసరావు స్వయంగా స్పందించారు. తన కొడుకు రవి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడని.. కేవలం వ్యూస్-లైకుల కోసం రవి భవిష్యత్తుని, ఎంతో టాలెంట్ ఉన్న పల్లవి కెరీర్‌ని పణంగా పెట్టొద్దని కోరారు. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకటికి రెండుసార్లు కన్ఫమ్ చేసుకోమ్మని సూచించారు. కాగా.. గంటా రవి ‘జయదేవ్’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే!

Related posts:
ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ పై ఓంకార్ షాకింగ్ కామెంట్స్‌!!
రామ్ చరణ్ బర్త్‌డే @ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
కెమెరా సాక్షిగా.. ఆర్జే చెంపఛళ్ళుమనిపించిన యంగ్ హీరో అర్జున్‌కపూర్ (వీడియో)
పబ్లిక్‌లో బాలయ్యకు షాకిచ్చిన చిచ్చరపిడుగు
స్టూడెంట్‌తో టీచర్ ఎఫైర్.. 7 రోజులు గాయబ్.. చివర్లో ట్విస్ట్?
ఏంటీ.. పవన్ కళ్యాణ్ మరీ అంత చీపా?

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.