సెన్సార్ పూర్తి చేసుకున్న శాతకర్ణి.. ఇక రణమే!

Gauthamiputra shatakarni completed cansor
Tellmeboss.net

తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రచించడానికి నందమూరి నటసింహం సిద్ధమవుతున్నారు. సినిమా టైటిల్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకు అన్నింటా గౌతమీపుత్ర శాతకర్ణి తన మార్క్ కనిపించింది. కాగా గౌమతీపుత్ర శాతకర్ణి తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ర‌న్‌టైమ్ సుమారు 2 గంట‌ల 15నిముషాలు. యూ బై ఏ స‌ర్టిఫికెట్ ద‌క్కింది. సినిమా చూసి సెన్సార్ స‌భ్యులు ఆనందంగా ఫీల‌య్యార‌ట‌. తెలుగు తెర‌పై ఇలాంటి సినిమాలు అరుదుగా వ‌స్తాయ‌ని, క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మోడ‌ర్న్ క్లాసిక్‌గా నిలుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నార‌ట‌. అంత‌గా వారి మెప్పును పొందింద‌ని స‌మాచారం.

Tellmeboss.net

శాత‌వాహ‌నుల రాజు క‌థ‌తో తీసిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో ప్ర‌తి భాగం బాగా హైలైట్ అయింద‌ట‌. బాల‌య్య ఫెరోషియ‌స్‌ పెర్‌ఫార్మెన్స్ సినిమాకి బాగా అడ్వాంటేజ్‌గా మారింద‌ట‌. వీర‌త్వం, మ‌ద‌ర్ సెంటిమెంట్‌, రొమాన్స్‌తోపాటు న‌వ‌ర‌సాలు క‌లిసిన సీన్‌ల‌ను క్రిష్ అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని స‌మాచారం. ప్ర‌తి ఫ్రేమ్ రిచ్‌గా సాగింద‌ని, విజువల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దాడ‌నే మాట వినిపిస్తోంది. ఈ మూవీలో రెండు సీన్‌లకు థియేట‌ర్లు బ‌ద్దలవుతాయ‌నే మాట వినిపిస్తోంది. ఆ రెండు సీన్‌ల‌లో ఒక‌టి… స‌ముద్ర తీరంలో యుద్ధం..  ఈ సీన్ మొత్తాన్ని గ్రీన్‌మ్యాట్‌పై చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు క్రిష్‌. సుమారు 10నిముషాల పాటు సాగే ఈ సన్నివేశం మినీ క్ల‌యిమాక్స్‌లా ఉంటుంద‌ట‌. శాత‌వాహ‌న రాజుల ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించే స‌న్నివేశం ఇదేన‌ట‌.

ఇక‌, రెండో సీన్‌… సింహాన్ని లొంగ‌దీసి దానిని స్వారీ చేసే సీన్‌. మృగ‌రాజు సింహంతో పోరాడి.. జూలు ప‌ట్టుకొని దాని మీద స్వారీ చేస్తూ అంతఃపురం వ‌ర‌కు వ‌స్తాడ‌ట బాల‌య్య‌. ఈ సీన్ మ‌రో హైలైట్ అంటున్నారు. ఈ రెండు స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు క్రిష్‌.. అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించాడ‌ట‌. మొత్తం సినిమాలో ఇలాంటి సన్నివేశాలు మ‌రో మూడు నాలుగున్నాయ‌ని, గ్రీకు రాజుల‌తో చేసే యుద్ధంతోపాటు, మ‌ద‌ర్ సెంటిమెంట్ కూడా అడ్వాంటేజ్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నార‌ట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. సంక్రాంతికానుక‌గా విడుద‌ల‌కానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. సెన్సార్ బోర్డ్ మాత్రం సినిమా హిట్ అవుతుందని సంకేతాలిచ్చేసినట్లే అని నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.