గాయత్రి మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

నటీనటులు: మోహన్ బాబు, మంచు విష్ణు , శ్రేయ శరణ్, నిఖిలా విమ‌ల్, బ్ర‌హ్మ‌నందం త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫి: సర్వేష్ మురారి
సంగీతం: థ‌మ‌న్
దర్శకత్వం: మదన్
నిర్మాత: మోహన్ బాబు
రిలీజ్ డేట్: 09-02-2018

గ‌త కొంత కాలంగా క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈసారి హీరోగా గాయ‌త్రి మూవీతో మ‌న ముందుకు వ‌చ్చాడు. ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేసిన మోహ‌న్ బాబు హిట్ కొడ‌తాన‌నే ధీమాతో ఉన్నాడు. ఫ్యామిలీ సినిమాల దర్శకుడు మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన గాయత్రి సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
శివాజీ (మోహ‌న్ బాబు) ఒక స్టేజీ ఆర్టిస్ట్. తన వాళ్లందరినీ కోల్పోయిన శివాజీ ఓ అనాధాశ్రమాన్ని నడిపిస్తుంటాడు. ఆశ్రమాన్ని నడిపించడానికి కావాల్సిన డబ్బుని సంపాదించడం కోసం వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు కోర్టులో పడే శిక్షలను వారి మారువేషంలో వెళ్లి శివాజీ అనుభవిస్తుంటాడు. ఇలా చేయడంతో భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తుంటాడు శివాజీ. ఈ క్రమంలో గాయత్రి పటేల్(మోహన్‌బాబు) అనే డాన్ స్థానంలో జైలుకి వెళ్తాడు శివాజీ. అతడికి ఉరిశిక్ష పడిందని తెలియక జైలుకి వెళ్లిన శివాజీ అనుకోకుండా ఇరుక్కుపోతాడు. మరి ఈ కేసు నుండి శివాజీ ఎలా తప్పించుకున్నాడు..? అసలు గాయత్రి పటేల్ ఎవరు..? అతడికి ఉరిశిక్ష పడడానికి గల కారణాలు ఏంటి..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
ఇప్పటి వరకు క్లాస్, హార్ట్‌ టచింగ్ సినిమాలు మాత్రమే చేసిన మదన్ తొలిసారిగా ఓ థ్రిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోహన్‌ బాబు లాంటి విలక్షణ నటుడికి తగ్గ కథా కథనాలతో ఆకట్టుకున్నాడు. చాలా కాలం తరువాత మోహన్‌ బాబును పూర్తి నెగెటివ్ క్యారెక్టర్‌లో చూపించిన మదన్ మెప్పించాడు. కథ పరంగా తీసుకున్న జాగ్రత్తలు దర్శకుడు కథనం విషయంలో కూడా తీసుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్‌ హాఫ్‌లో వేగంగా కథ నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో మాత్రం కాస్త స్లో అయ్యాడు.

సెకండ్‌ హాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌ ఆకట్టుకున్నా కథనం నెమ్మదించటం, అవసరం లేకపోయినా ఇరికించిన ఐటమ్‌ సాంగ్‌ కాస్త ఇబ్బంది పెడతాయి. గాయత్రి పటేల్ అనే పాత్ర కథలోకి ప్రవేశించిన దగ్గర నుంచి సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండాయి. మోహన్‌బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. శివాజీ పాత్ర సాధారణంగానే ఉన్నా.. గాయత్రి పటేల్ పాత్ర మాత్రం సినిమాకు ప్లస్ అయింది. ఆ పాత్రలో మోహన్ బాబు జీవించేసారు. ఆ పాత్ర పలికే ప్రతి మాట ఆకట్టుకుంటుంది. సినిమాకు మేజర్‌ ప్లస్ పాయింట్‌ డైమండ్‌ రత్నబాబు డైలాగ్స్‌. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివాజీ పాత్రతో పలికించిన డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. ఓవరాల్‌గా గాయత్రి చిత్రం మోహన్ బాబు వన్ మ్యాన్ షోగా సాగుతుంది.

నటీనటులు పర్ఫార్మెన్స్:
కలెక్షన్‌ కింగ్ మోహన్ బాబు రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. యాక్టింగ్‌ విషయంలో మోహన్ బాబు తనదైన మార్క్‌తో రెచ్చిపోయాడు. ఫైటింగ్‌ సీన్స్‌లో చాలా కష్టపడి చేశాడు మోహన్ బాబు. ఆయన చూపించిన కమిట్‌మెంట్‌కు హ్యాట్సాఫ్ అంటారు జనాలు. మంచి విష్ణు, శ్రియాలు కనిపించేది కొంతసేపే అయినా తమ యాక్టింగ్‌తో మంచి ఇంప్రెషన్ కొట్టేశారు. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి మెప్పించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఇప్ప‌టి వ‌ర‌కూ కుటుంబ క‌థా చిత్రాల‌ను తీసిన మ‌ద‌న్ తొలిసారిగా యాక్ష‌న్ ఓరియెంటెడ్ మూవీని తీశాడు. ద‌ర్శ‌క‌త్వం పరంగా అన్నీ బాగున్నా బ‌ల‌మైన కథనం లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశకు లోనవుతారు. తాను రాసుకున్న కథను పర్ఫెక్ట్‌గా చూపించినా అది అన్ని వర్గాల జనాలను ఆకట్టుకోలేకపోయింది. అయితే మోహన్ బాబు ఫ్యాన్స్‌కు మాత్ర ఇది పెద్ద ట్రీట్ అనే చెప్పాలి. థమన్ సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. సర్వేశ్ మురారి అందించిన కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చివరిగా: గాయత్రి – మోహన్ బాబు వన్ మ్యాన్ షో!

నేటిసినిమా రేటింగ్: 3.5/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.