‘గీత గోవిందం’ ఇన్‌సైడ్ టాక్.. హే భగవాన్!

ఇప్పుడు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే.. అది ‘గీత గోవిందం’ చిత్రమే! ఫస్ట్‌లుక్ పోస్టర్ దగ్గర నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ మూవీ.. ఇక ప్రోమోలు, పాటలతో మరింత మెస్మరైజ్ చేసింది. దీంతో జనాలు ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ చూడముచ్చటైన జంట తమను బాగా ఎంటర్టైన్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ.. రిలీజ్ అయ్యాక ఈ అంచనాలు బోల్తాపడే ఛాన్స్ వుందని ఇండస్ట్రీ టాక్!

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమా కథ కొత్తదేమీ కాదని, ఇది అరిగిపోయిన రొటీన్ స్టోరీతోనే తెరకెక్కిందని తెలుస్తోంది. ఇదివరకే వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్‌లాగే.. ఇందులో హీరో చేసే చేష్టలు నచ్చక అతనిపై హీరోయిన్ నెగెటివ్ ఇంప్రెషన్ పెంచుకుంటుంది. హీరో మాత్రం ఆమె అందానికి దాసోహమైపోయి.. ప్రేమలో పడతాడు. ఆమెని ఇంప్రెస్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఒకానొక సమయంలో హీరో అనుకోకుండా హీరోయిన్‌ని ముద్దు పెట్టేస్తాడు. దాన్ని అడ్డం పెట్టుకుని హీరోని ఆమె బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రానురాను హీరోపై ఆమెకున్న కోపం ప్రేమగా మారుతుంది. చివరికి ఇద్దరు ఒక్కటవ్వుతారు. ఇదేనండి.. ఈ సినిమా కథ!

ఈ రొటీన్ స్టోరీ జనాలకు ఎక్కాలంటే.. నెరేషన్‌తోనే మాయ చేయగలగాలి. ఫీలింగ్స్ బాగా పండించాలి. కామెడీతో బాగా నవ్వించగలగాలి. ఈ చిత్రబృందం కూడా ఇదే కమర్షియల్ ఫార్ములాని ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఈ ఫార్ములా వర్కౌట్ అయితే.. చిత్రం హిట్ అవ్వడం పక్కా! అలా కాకుండా కాస్త తేడా కొడితే మాత్రం.. అంతే సంగతులు! మరి రిజల్ట్ ఎలా వస్తుందో ఆగస్టు 15 వరకు వేచి చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.