‘మహానటి’ మేకర్స్‌పై ఆ హీరో కూతురు తాండవం

యావత్ దక్షిణాది ప్రజల నుంచి కీర్తి-ప్రతిష్టలు దక్కించుకున్న ‘మహానటి’ సినిమా.. ఒక్క జెమిని గణేషన్ కూతురు (అతని తొలిభార్య అలిమేలుకు పుట్టిన సంతానం) కమలా సెల్వరాజ్ చేతుల్లో మాత్రం అప్రతిష్ట పాలయ్యింది. ఈ సినిమానే మొత్తం తప్పుగా చిత్రీకరించారంటూ ఆరోపణలు చేసిన ఆమె.. మేకర్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తండ్రిని చాలా తప్పుగా చూపించారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మహానటి చిత్రంలో మా నాన్న జెమినీ గణేషన్‌ను విలన్‌గా చూపించారు. సావిత్రికి మద్యం అలవాటు చేయించింది జెమినీనే అన్నట్లుగా సినిమాలో చిత్రీకరించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. సావిత్రి కష్టకాలాల్లో ఉన్నప్పుడు పేరున్న నటులెవరూ ఆమెను పట్టించుకోలేదు. ‘ప్రాప్తం’ సినిమాని సావిత్రి తీస్తున్నప్పుడు.. జెమినీ ఆమెని కలవడానికి వెళ్ళారు. అయితే.. ఆ సమయంలో నా తండ్రి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎదుర్కొన్నారు. సావిత్రి బలవంతంగా తన వాచ్‌మ్యాన్‌ల ద్వారా జెమినీని బయటకు పంపించేసింది. దాన్ని అవమానంగా భావించిన ఆయన.. అప్పట్నుంచి సావిత్రిని కలవడానికి వెళ్ళలేదు. ఓసారి మేము కూడా సావిత్రిని కలవడానికి వెళ్తే.. మా మీద తన పెంపుడు కుక్కల్ని వదిలింది’’ అంటూ కమలా షాకింగ్ రహస్యాలు బయటపెట్టారు. తనకు తెలిసినంతవరకు సావిత్రికి జెమినీ గణేషన్ అంటే అస్సలు ఇష్టం లేనట్లుందని ఆమె తన అభిప్రాయం వ్యక్తపరిచారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘తన మొదటి భార్య అలిమేలుపై జెమినీకి ప్రేమ లేదన్నట్లుగా ఈ చిత్రంలో చూపించారు. ఆమె కంటే సావిత్రినే ఎక్కువగా ప్రేమించినట్లు ప్రెజెంట్ చేశారు. అసలు అలిమేలుపై గణేశన్‌కు ప్రేమే లేదన్నట్లుగా ఎలా చూపించగలరు? అలిమేలు, గణేశన్‌కు ఇద్దరు పిల్లలున్నారనే విషయం మరిచిపోయారా? సినిమాలో చూపించిందంతా చాలా తప్పు. ఓ మనిషి జీవితం గురించి 3 గంటల్లో ఎలా చెప్పేస్తారు?’ అంటూ చిత్రబృందంపై కమల మండిపడ్డారు. మరి.. దీనికి యూనిట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.