‘గూఢచారి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిగర్

విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనడం, రిలీజయ్యాక వాటిని అందుకుని ప్రేక్షకుల మెప్పు పొందడంతో.. ‘గూఢచారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తోంది. ఫస్ట్ వీకెండ్‌లో ఓ కుదుపు కుదిపేసిన ఈ మూవీ.. వీక్ డేస్‌లోనూ తన డీసెంట్ పరుగును కొనసాగించింది. బరిలో వేరే చిత్రాలు వున్నప్పటికీ.. వాటిని పూర్తిగా డామినేట్ చేసి, వార్ వన్‌సైడ్‌లో దూసుకుపోతోంది.

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్‌వైడ్‌గా రూ.4.45 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టిన ‘గూఢచారి’… ఆ తర్వాత నాలుగు రోజుల్లో రూ.2.45 కోట్ల షేర్ కొల్లగొట్టింది. దీంతో మొత్తం 7 రోజుల్లో రూ.6.90 కోట్లు నమోదైంది. ఇది అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిగర్! ఇప్పటివరకు వచ్చిన వసూళ్ళ ప్రకారం.. చాలా ఏరియాల్లో బయ్యర్స్ సేఫ్ జోన్‌లోకి ఎంటరైపోయినట్లు తెలిసింది. ఇంకొన్ని చోట్ల మాత్రమే ఈ మూవీ కొంచెం రికవర్ చేయాల్సి వుంది.

పాజిటివ్ టాక్‌తో డీసెంట్‌ రన్ సాగిస్తోంది కాబట్టి.. ఫుల్ రన్‌లో ఆ మొత్తాన్ని కూడా రాబడుతుందని ట్రేడ్ నమ్మకం! కంటెంట్ బలంగా వుంటే.. చిన్న సినిమా అయినా తన సత్తా చాటుకోగలదని ‘గూఢచారి’ మరో ఉదాహరణగా నిలిచిందని చెప్పుకోవచ్చు.

ఏరియాలవారీగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 2.20
ఉత్తరాంధ్ర : 0.56
కృష్ణా : 0.46
సీడెడ్ : 0.40
ఈస్ట్ : 0.35
గుంటూరు : 0.31
వెస్ట్ : 0.20
నెల్లూరు : 0.12
ఏపీ+తెలంగాణ : రూ.4.60 కోట్లు (షేర్)
రెస్టాఫ్ ఇండియా : 0.50
ఓవర్సీస్ : 1.80
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ.6.90 కోట్లు (షేర్)

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.