అడివి శేష్ ‘గూఢచారి’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : గూఢచారి
నటీనటులు : అడివి శేష్‌, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌, మధు శాలిని, సుప్రియ తదితరులు
దర్శకత్వం : శశి కిరణ్‌ టిక్కా
నిర్మాత : అభిషేక్‌ పిక్చర్స్‌
కథ, రచన : అబ్బూరి రవి, అడివి శేష్‌
సంగీతం : శ్రీ చరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ : షానియల్‌ డియో
ఎడిటింగ్‌ : గ్యారీ
బ్యానర్‌: అభిషేక్‌ పిక్చర్స్‌
విడుదల: 03-08-2018

‘క్షణం’తో రచయితగా, నటుడిగా తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్న అడివి శేష్.. ఇప్పుడు ‘గూఢచారి’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తనే రచయిత కావడం, ప్రోమోలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా వుండటం, హాలీవుడ్ ‘జేమ్స్‌బాండ్’ సిరీస్‌ని తలపించడంతో.. ఈసారి కూడా మనోడు థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తోనే థ్రిల్ చేయనున్నాడనే అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొంది. మరి.. వాటిని అందుకోవడంలో శేష్ సక్సెస్ అయ్యాడా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :
గోపి(అడివి శేష్‌) తన నాన్నలాగే సీక్రెట్ ఏజెంట్ అవ్వాలని చిన్నప్పటి నుంచే బలంగా కోరుకుంటూ ఉంటాడు. కానీ.. అతని మామయ్య సత్య (ప్రకాష్ రాజ్)కి అది ఇష్టం ఉండదు. తండ్రిలాగే గోపీ కూడా ఎక్కడ ప్రాణాలు కోల్పోతాడా? అనే భయంతో.. అతని పేరు అర్జున్‌గా మార్చి, సీక్రెట్ ఏజెంట్ అవ్వకుండా చూస్తాడు. కానీ.. ఎలాగైనా సీక్రెట్ ఏజెంట్ అవ్వాలని బలమైన ఆకాంక్షతో.. రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) ఉద్యోగం కోసం ‘170’ దరఖాస్తు చేసుకుంటాడు.

చివరకు త్రినేత్ర ఏజెన్సీ అర్జున్‌కు అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి ‘గూఢచారి 116’గా నియమిస్తుంది. అయితే.. ఇంతలోనే కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకోవడంతో, దేశం దృష్టిలో అర్జున్ తీవ్రవాదిగా ముద్రింపబడతాడు. త్రినేత్ర ఏజెన్సీ కూడా అతడ్ని వెంబడిస్తుంది. అసలు సీక్రెట్ ఏజెంట్‌గా నియమించబడిన అర్జున్‌పై తీవ్రవాది ముద్ర ఎలా పడింది? దీని వెనుకున్న కారణాలేంటి? ఆ ముద్రని చెరిపేసుకోవడానికి అర్జున్ చేసిన సాహసాలేంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
‘క్షణం’ చిత్రంతో శేష్ ఎలా థ్రిల్ చేయగలిగాడో.. ‘గూఢచారి’తోనూ అంతే ఆకట్టుకున్నాడు. గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లే రాయడంలో తనకు సాటిలేదని మరోసారి నిరూపించుకున్నాడు. హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ తరహాలో ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహించని మలుపులతో ఇంట్రెస్టింగ్ స్టఫ్‌తో ఔరా అనిపించాడు. అనవసరమైన సన్నివేశాలేమీ రాసుకోకుండా స్ట్రెయిట్‌గా స్టోరీలోకి వెళ్లిపోయి.. మొదట్నుంచి, చివరివరకు ప్రేక్షకుల్ని ఆద్యంతం మైమరిపించేశాడు.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. సీక్రెట్ ఏజెంట్ అవ్వడం కోసం అర్జున్ చేసే ప్రయత్నాలు, త్రినేత్రలో చేరాక అక్కడ జరిగే వ్యవహారాలతో ఆసక్తిగా సాగుతుంది. హీరో-హీరోయిన్ల లవ్ స్టోరీని కూడా సీక్రెట్ మిషన్‌లాగే తీర్చిదిద్దడం మరో హైలైట్! ఇక విశ్రాంతికి ముందు వచ్చే సీన్స్.. ఒక్కసారిగా కథనే మార్చేస్తాయి. ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ మరింత షాక్‌కి గురిచేస్తుంది. ఇక ద్వితీయార్థం విషయానికొస్తే.. సినిమా కాస్త నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. జగపతి ఎంట్రీతో కథ మరో మలుపు తిరుగుతుంది కానీ.. బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగే సీన్లు కాస్త నిరాశపరుస్తాయి. అక్కడ స్ర్కీన్‌ప్లే అంత బిగుతుగా లేదు.

అయితే.. ప్రీ-క్లైమాక్స్‌లో మాత్రం కథ మళ్ళీ గాడిన పడుతుంది. అక్కడొచ్చే ట్విస్టులు మైండ్‌బ్లోయింగ్ అంతే! ఆ టైంలో ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. ఇక క్లైమాక్స్ కూడా అదిరిపోయింది. దేశభక్తి, సెంటిమెంట్‌ మేళవించిన క్లైమాక్స్‌‌తో మంచి ముగింపునిచ్చారు. ఓవరాల్‌గా చెప్పాలంటే.. మరో కొత్త జోనర్ చిత్రంతో టాలీవుడ్ స్థాయిని అడవి శేష్ మరింత పెంచేశాడని చెప్పుకోవచ్చు. హ్యాట్సాఫ్!!

నటీనటుల పనితీరు :
టాలీవుడ్ జేమ్స్‌బాండ్‌ల అడివి శేష్ చాలా చక్కగా నటించాడు. నిజాయితీ, దేశభక్తి, తండ్రీపై ప్రేమ.. ఇవన్నీ మేళవించిన క్యారెక్టర్‌లో తన సత్తా చాటాడు. అన్నీ తానై సినిమాని ముందుండి నడిపించాడు. నటుడిగానే కాకుండా రచయితగానూ రాణించాడు. శోభిత పాత్ర చిన్నదే అయినా.. ఉన్నంతలో బాగానే చేసింది. ప్రకాష్ రాజ్ ఎప్పట్లాగే తన విలక్షణ నటనతో మెస్మరైజ్ చేశాడు. సుప్రియ పాత్ర కాస్త సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. ఇక ఇందులో మరో హైలైట్ రోల్ జగపతిబాబుది! ఆయన పేరుని ప్రచారంలో పెద్దగా వాడుకోలేదు కానీ.. చిత్రంలో మాత్రం ప్రభావవంతంగా వాడుకున్నారు. క్లైమాక్స్‌ ముందు ఆయన పాత్రే కథని మలుపు తిప్పుతుంది. వెన్నెల కిషోర్‌ పాత్ర కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

సాంకేతిక ప్రతిభ:
షానియల్‌ డియో కెమెరా పనితనం బాగుంది. పరిమిత బడ్జెట్ అయినా.. రిచ్ లుక్స్‌తో హాలీవుడ్ రేంజులో చూపించారు. శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు ఓకే. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు శశి కిరణ్.. అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా, చాలా చక్కగా చిత్రాన్ని డీల్ చేశాడు.

చివరగా : టాలీవుడ్ జేమ్స్‌బాండ్
రేటింగ్ : 3.5/5

Related posts:
పూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్..నందమూరి అభిమానులు ఫుల్ హ్యపీ!!
నయన ఔట్.. శాతకర్ణుడి రాణిగా మగధీరుడి ప్రియురాలు
ఖైదీ నెం. 150గా మారిన కత్తిలాంటోడు!
విలన్‌గా మారనున్న మరో కామెడీ హీరో.. ఎవరో తెలుసా?
ఎట్టకేలకు ఆ హీరోకి హలో చెప్పిన కొరటాల
నా నువ్వే వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. హ్యాట్రిక్ కొట్టిన కళ్యాణ్ రామ్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.