ఆ డైరెక్టర్‌ను కందిరీగలా కుడతానంటున్న గోపీచంద్

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘‘పంతం’’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. కాగా తన నెక్ట్స్ మూవీని కూడా ఓకే చేశాడు గోపీచంద్. కందిరీగ ఫేం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక సినిమాను గోపీచంద్ ఒప్పుకున్నాడు.

పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో గోపీచంద్ ఒక సరికొత్త గెటప్‌లో మనకు కనిపిస్తాడు. ఈ సినిమాను ఉగాది రోజున లాంఛనంగా ప్రారంభించాలని చూస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు గోపీచంద్. కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఏదేమైనా కందిరీగ డైరెక్టర్‌తో సక్సెస్ కొట్టాలని చూస్తున్న గోపీచంద్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల కోసం నేటిసినిమా.కామ్ చూస్తూ ఉండండి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.