‘ఆక్సిజన్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. దడ పుట్టిస్తున్న రిపోర్ట్

oxygen-first-day-collection
Tellmeboss.net

వరుస వాయిదాలు ‘ఆక్సిజన్’ సినిమాని బాగా దెబ్బేశాయి.. అటు చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరపలేదు.. ఇండస్ట్రీలోనూ దీనిపై ఏమాత్రం బజ్ లేదు.. ఇక రిలీజయ్యాక మిక్స్‌డ్ టాక్ రావడం – క్రిటిక్స్ పెదవి విరచడంతో ఉన్న కాస్తోకూస్తో క్రేజ్ కూడా ఈ సినిమాని కుళ్లబొడిచాయి. అందుకే.. తొలిరోజు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం సత్తా చాటుకోలేకపోయింది. కేవలం రూ.1.59 కోట్లు (షేర్) మాత్రమే కలెక్ట్ చేసింది. రూ.25 కోట్లకు మించిన బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి కేవలం అంత తక్కువ వసూళ్లు రావడం నిజంగా దారుణం.

Tellmeboss.net

నిజానికి.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న గోపీచంద్‌ కెరీర్‌కి ఈ చిత్రం ఆక్సిజన్ లాంటిది. రెండు, మూడు ఇంటర్వ్యూల్లో అతను ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుందని, తన కెరీర్‌ని తిరిగి గాడిలో నెలబెడుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. కానీ.. అవన్నీ బోల్తాకొట్టేశాయి. అతని గత చిత్రం ‘గౌతమ్‌నంద’ (రూ.3.26) ఫస్ట్‌డే రాబట్టిన వసూళ్లకంటే చాలా తక్కువ నమోదు చేసి.. గోపీచంద్‌కి ‘ఆక్సిజన్’ అందకుండా చేసింది. మరి.. రూ.13 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ మూవీ అంతమొత్తాన్ని రికవర్ చేస్తుందా? అనేది డౌటే!

ఏరియాలవారీగా ఫస్ట్ డే కలెక్షన్స్ : (లక్షల్లో)
నైజాం : 49
సీడెడ్ : 26
గుంటూరు : 29
ఉత్తరాంధ్ర : 20
ఈస్ట్ గోదావరి : 11
వెస్ట్ గోదావరి : 10
కృష్ణా : 09
నెల్లూరు : 05
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ.1.59 కోట్లు

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.