రష్మీని తోసేసిన ‘బిగ్‌బాస్’ హరితేజ..?

hari teja to replace rashmi gautam in jabardasth

‘బిగ్‌బాస్’ షో పుణ్యమా అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ హరితేజకి ఎక్కలేని పాపులారిటీ వచ్చిపడింది. తన చలాకీదనంతోపాటు కామెడీ టైమింగ్‌తోనూ అదరగొట్టేయడంతో ఆమెకి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆమెకి వరుసపెట్టి అవకాశాలు వచ్చిపడుతున్నాయి. కేవలం సినిమాల్లోకి కాదండోయ్.. టివి రంగం నుంచి కూడా ఆమెకి ఛాన్సులు వస్తున్నాయి. ఆల్రెడీ మంచులక్ష్మీ స్టార్ట్ చేసిన ఒక షోకి వ్యాఖ్యతగా డీల్ ఓకే అయిపోగా.. మరో బ్రహ్మాండమైన ఆఫర్ ఈమె గుమ్మం ముందుకొచ్చి వాలిందని సమాచారం.

టెలివిజన్‌లో బాగా పాపులర్ అయిన జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించాల్సిందిగా హరితేజకి ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. షాక్ విషయం ఏంటంటే.. రష్మీని తీసేసి ఆమె స్థానే హరితేజకి యాంకర్‌గా తీసుకోవాలని మల్లెమాల టీం భావిస్తోందట. రష్మీ సరిగ్గా తెలుగు మాట్లాడలేకపోవడం, మునుపటిలాగా చురుకుదనం చూపించలేకపోతుండడంతోపాటు సినిమాలతోనూ కాస్త బిజీగా వుండడంతో.. ఆమెని తీసేసి హరితేజని పెట్టుకోవాలని మల్లెమాలవారు ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. రష్మీలో లేని క్వాలిటీస్ హరితేజలో పుష్కలంగా వుండటంతో.. ‘జబర్దస్త్’ షోకి యాంకర్‌గా పర్ఫెక్ట్ సూట్ అవుతుందని వారి అభిప్రాయమట. అయితే.. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

ఒకవేళ ఇది నిజమైతే.. రష్మీకి పెద్ద దెబ్బ తగిలినట్టే. సినిమా ఆఫర్లు వస్తున్నా.. ఏవీ హిట్ అవ్వట్లేదు. అన్నీ బోల్తాపడుతున్నాయి. దీంతో ఈమె జబర్దస్త్ షోతోనే తన కెరీర్ బండిని లాగుతోంది. ఇలాంటి టైంలో ఆమెని తీసేస్తే.. దారం తెంపిన గాలిపటంలా రష్మీ కెరీర్ డేంజర్‌లో పడిపోవడం ఖాయం. చూద్దాం.. ఏమవుతుందో!

Related posts:
దాన్ని మగవారికంటే ఆడవాళ్ళే ఎక్కువ వాడుతున్నారట!
బిర్యానీ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. అతిగా తిన్నారా అంతే!!
నీళ్ల కోసం పెళ్లి ఫోటోలు అమ్ముకుంటున్న హీరోయిన్
మసాజ్ అని వెళితే.. ఆమె ఏం చేస్తుందో తెలుసా??
రాంగోపాల్ వర్మ మోసం చేశాడు : ‘వీరప్పన్’ భార్య
చిచ్చుపెట్టిన ‘బొమ్మ’.. కొట్టుకుంటున్న మహేష్-ప్రభాస్ ఫ్యాన్స్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.