మహేష్‌ని అడ్డంగా బుక్ చేసిన పవన్ డైరెక్టర్

స్టార్ హీరోలతో పని చేయాలని ఎవరికి కోరిక ఉండదు చెప్పండి.. పెద్ద పెద్ద దర్శకులే బార్లు తీరుతుంటారు. ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారా? ఎప్పుడెప్పుడు మూవీ చేద్దామా? అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లకి ఒక ఛాన్స్ దొరికితే చాలు.. ఎలాగైనా హీరోల్ని బుట్టలో పడేయాలని ప్రయత్నిస్తుంటారు. సరిగ్గా హరీష్ శంకర్ కూడా ఇప్పుడదే చేశాడు. ప్రిన్స్ మహేష్‌బాబుని తన మాయలో పడేసే ఛాన్స్ రాకరాక రావడంతో.. మనోడు చెలరేగిపోయాడు.

‘సమ్మోహనం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి మహేష్‌తోపాటు హరీష్ శంకర్ కూడా రాగా.. ఇదే మంచి ఛాన్స్ అనుకుని అతను అటువైపు నుంచి నరుక్కుంటూ వచ్చాడు. ‘పోకిరి.. బిజినెస్‌మేన్ సినిమాల్లో మహేష్ నటనలో పూరి జగన్నాథ్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ కనిపిస్తుంది. అలాగే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో’ శ్రీకాంత్ అడ్డాల స్టయిల్… ‘దూకుడు’లో శ్రీను వైట్ల టైమింగ్… కొరటాల శివ సినిమాల్లో సటిల్ పర్ఫార్మెన్స్ కనిపిస్తాయి. ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తే.. ఆ దర్శకుడి స్టైల్‌ని మహేష్ ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. ఈ విషయంలో ఆయన్ను పాదరసం అనేయొచ్చు. ఏదో ఒకరోజు మహేష్‌లో హరీష్ శంకర్ బాడీ లాంగ్వేజ్‌ని చూడాలని అనుకుంటున్నాను’’ అంటూ హరీష్ చెప్పుకొచ్చాడు.

ముందుగా మనోడు మహేష్‌ని గొప్పగా పొగిడేసి.. ఆ వెంటనే తనకూ ఓ ఛాన్స్ ఇవ్వాల్సిందిగా హరీష్ ఇండైరెక్ట్‌గా అడిగేశాడు. ఆహా.. ఏం తెలివి కదూ! ఇతర దర్శకులు కూడా ఇలా పొగడ్తలతోనే మాయ చేస్తారు కానీ.. హరీష్ మాత్రం ఓ మెట్టు పైకి ఎక్కి, వినూత్నంగా రిక్వెస్ట్ చేయడం హైలైట్! ఒక విధంగా చెప్పాలంటే.. నిండుసభలో మహేష్‌ని ఛాన్స్ ఇవ్వమని అడ్డంగా బుక్ చేసినట్లే! మరి.. మహేష్‌బాబు అతని ఛాన్స్ ఇస్తాడా? లేదా? చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.