ఎన్టీఆర్‌లా అచ్చు గుద్దినట్టు చేస్తా.. ఛాలెంజ్ చేసిన హీరో

hero challenge he will do acting like junior ntr
Tellmeboss.net

నూనూగు మీసాల సమయంలోనే తానో గొప్ప నటుడినని నటరుద్ర ఎన్టీఆర్ నిరూపించుకున్నాడు. ఏ పాత్రైనా సరే.. అందులో పరకాయ ప్రవేశం చేసి, దానికి ప్రాణం పోస్తాడు. నటనలో తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. తోటి నటీనటులు సైతం యాక్టింగ్‌లో ఎన్టీఆర్‌ని మించిన నటుడు ఎవరూ లేరంటూ కొనియాడిన సందర్భాలు సైతం ఎన్నో వున్నాయి.

అంతెందుకు.. రీసెంట్‌గా ‘జై లవకుశ’ విడుదలైన తర్వాత తారక్‌పై ఏ రేంజులో ప్రశంసల వర్షం కురిసిందో అందరికీ తెలుసు. టాప్ సెలబ్రిటీలు సైతం తారక్ నటనకు గర్వంతో ఉప్పొంగిపోయి.. అతనికి దాసోహం అయిపోయారు. అలాంటి తారక్‌కి ఓ హీరో ఛాలెంజ్ చేశాడు. అతనిలాగే అచ్చగుద్దినట్టు తానూ తన నటవిశ్వరూపం చూపిస్తానని సవాల్ విసిరాడు. అతనెవరో కాదు.. తమిళ స్టార్ హీరో విశాల్. ఉన్నట్లుండి ఇతనికి ఈ పూనకం ఎందుకు వచ్చింది? అని అనుకుంటున్నారా! పదండి.. మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం.

Tellmeboss.net

తారక్ కెరీర్‌ని అనూహ్య మలుపు తిప్పిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్ చేసేందుకు మేకర్స్ చాలాకాలం నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. సినిమా చూశాక తారక్‌లా తాము ఎనర్జీ పండించలేమంటూ ఎందరో హీరోలు వెనకడుగు వేశారు. కానీ.. విశాల్ మాత్రం అందరిలా కాకుండా ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు. ఎన్టీఆర్‌లాగే అచ్చుగుద్దినట్లు నటవిశ్వరూపం ప్రదర్శించి, తన సత్తా చాటుకుంటానని అన్నాడు. మరి.. తారక్‌లా ఇతను విశ్వరూపం చూపిస్తాడా? లేదా? వేచి చూడాలి.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.