బోయపాటి తలపై బండ వేసిన రామ్ చరణ్.. పాపం!

ఈరోజుల్లో స్టార్‌డమ్ నిలబెట్టుకోవడం అంటే ఆషామాషీ కాదు. ఒక హిట్ సినిమా తీశాక.. తదుపరి చిత్రం మరింత బాగుండేలా చేయాలి. దర్శకులకు ఇదే పెద్ద రిస్క్ అంటే.. హీరోల స్టేటస్ వాళ్ళని మరింత ఒత్తిడికి గురి చేస్తోంది. ఒక హీరో అనుకోకుండా భారీ హిట్ కొట్టాడంటే.. అతనితో జత కలిసే దర్శకుడికి అంతకుమించి పెద్ద హిట్ ఇప్పించాలనే ప్రెజర్ తారాస్థాయిలో ఉంటుంది. సేమ్.. ఇదే పరిస్థితిని బోయపాటి శ్రీను ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు.

రామ్ చరణ్ స్టార్ హీరోనే అయినప్పటికీ.. ‘రంగస్థలం’ రిలీజ్ ముందువరకూ అతను హిట్ కోసం సతమతమవుతున్న స్ట్రగ్లింగ్ హీరో! ‘ధృవ’తో హిట్ సాధించినా.. చరణ్‌కి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టినా.. అనుకున్న స్థాయిలో అది భారీ హిట్ అవ్వలేదు. ‘రంగస్థలం’ ఇంకా సెట్స్ మీద ఉన్నప్పుడే అతనితో బోయపాటి ఓ మూవీకి కమిట్ అయ్యాడు. సో.. తన సినిమా రిజల్ట్ మీద అతనికి అప్పట్లో పెద్దగా పట్టింపు ఉండకపోయేదేమో! కానీ.. ‘రంగస్థలం’ రిలీజ్ అవ్వడం, అది ‘నాన్-బాహుబలి’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం.. బోయపాటికి పెద్ద తలనొప్పిగా మారింది.

రామ్ చరణ్‌తో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు కాబట్టి.. ఖచ్చితంగా అంచనాలకు మించిన సినిమాని తెరకెక్కించాలి. కలెక్షన్ల పరంగానూ ‘రంగస్థలం’ స్థాయిలో కురిపించేలా వుండాలి. వందకోట్ల దిశగా పరుగులు పెట్టించాలి. ఫ్యాన్స్ కూడా హై-ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ.. ఇక్కడ బోయపాటికేమో రొటీన్ డైరెక్టర్ అనే ముద్ర వుంది. కథలోనూ కొత్తదనం చూపించడు. మరి.. ఈ నెగెటివిటీని తుడిచిపెట్టి బోయపాటి భారీ హిట్ ఇవ్వగలడా? లేదా? వేచి చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.