వామ్మో విపరీతమై ప్రచారం ఆ సినిమాకు

Huge publlicity for that Khaidi no 150

సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి గురించి అందరికి తెలిసిందే. అనుకోకుండా శతమానంభవతి పోటీపడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా అతడి చేతిలో 100కు పైగా ధియేటర్లు ఉండటమే. ఇది ఇలా ఉంటే ప్రచారంపై మాత్రం ఒకరికి మించి ఒకరు ఎవరి పంథాలో వాళ్లు దూసుకొని వెళ్లిపోతున్నారు. బాలకృష్ణ శాతకర్ణి టీమ్ ను చూస్తే భారీగా ఏర్పాట్లు చేసిన కార్యక్రమాలతో యువత్ తెలుగు వారికి ప్రపంచమంతటా తెలిసేటట్లు చేస్తుంటే, ఖైదీ నెంబర్ 150 నిర్మాత అయిన రాంచరణ్ మాత్రం దీనికి భిన్నంగా ప్రచారం చేస్తున్నట్లు  కనబడుతోంది.

ట్రైలర్ లేకుండానే టీజర్ తోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ప్రేక్షకులలో హైప్ పెంచేందుకు ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటి గత కొన్ని రోజులుగా విడుదల చేసి అందరిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే ఖైదీలోని పాటలు హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇది ఇలా ఉంటే రాంచరణ్ ఈ సారి అల్లు అరవింద్ ప్రమోషన్ పంథాలో కాకుండా అపోలో వారి టీమ్ సహాయంతో ఈ సినిమా ప్రచారం భారీగా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని నగరంలో ఎక్కడ చూసినా రహదారికి అవతల, ఇవతల ఎడ్వర్టైజ్ మెంట్తో దుమ్మెురేపుతున్నాడు. చూడాలి మరి ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు చేస్తుందో?

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.